బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
పాలకమండలి పాలనకు నేటితో తెర బీసీసీఐ కార్యదర్శిగా అమిత్ షా తనయుడు ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు…బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ సిఫారసులకు అనుగుణంగా జరిగిన ఎన్నికల తర్వాత…బోర్డు సరికొత్త కార్యవర్గానికి మార్గం సుగమయ్యింది. దేశంలోని వివిధ సంఘాల క్రికెట్ ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర…కార్యవర్గ పదవులకు నామినేషన్లు వేయటం లాంఛనంగా ముగిసింది. సౌరవ్ గంగూలీ అధ్యక్షుడుగా, కేంద్ర హోంమంత్రి […]
- పాలకమండలి పాలనకు నేటితో తెర
- బీసీసీఐ కార్యదర్శిగా అమిత్ షా తనయుడు
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు…బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ సిఫారసులకు అనుగుణంగా జరిగిన ఎన్నికల తర్వాత…బోర్డు సరికొత్త కార్యవర్గానికి మార్గం సుగమయ్యింది.
దేశంలోని వివిధ సంఘాల క్రికెట్ ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర…కార్యవర్గ పదవులకు నామినేషన్లు వేయటం లాంఛనంగా ముగిసింది.
సౌరవ్ గంగూలీ అధ్యక్షుడుగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జెయ్ షా కార్యదర్శిగాను, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆఖరి సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారిగాను బాధ్యతలు స్వీకరించారు.
ముంబైలో ముగిసిన బోర్డు సర్వసభ్యసమావేశంలో కార్యవర్గం ఎంపిక ఏకగ్రీవంగా ముగియటం విశేషం.
బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఉన్న సౌరవ్ గంగూలీ…బీసీసీఐ సరికొత్త నియమావళి ప్రకారం 2020 సెప్టెంబర్ వరకూ మాత్రమే పదవిలో కొనసాగుతాడు.
2015 నుంచి బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షపదవిలో సౌరవ్ గంగూలీ కొనసాగుతూ వస్తున్నాడు.
ముగిసిన వినోద్ రాయ్ అండ్ కో పాలన…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండేళ్ల క్రితం బీసీసీఐ పాలనాబాధ్యతలు చేపట్టిన వినోద్ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పాలకమండలి పాలన ఈరోజుతో ముగిసింది.
వినోద్ రాయ్ తో పాటు డయానా ఎడుల్జీ, రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయే పాలకమండలి సభ్యులుగా సేవలు అందించిన సంగతి తెలిసిందే.
ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని సరికొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టడంతోనే… పాలకమండలి తన బాధ్యతల నుంచి తప్పుకొంది.