పోతిరెడ్డిపాడు రికార్డు... ఏడో సారి ఉరకలెత్తుతూ కృష్ణమ్మ...
గత ఐదేళ్లుగా నీరసించిన కృష్ణమ్మ ఈ ఏడాది మాత్రం పదేపదే తెలుగు రాష్ట్రాల వైపు ఉరకలెత్తుతూ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడోసారి కృష్ణమ్మ భారీ వరదగా దూసుకొస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి 11.30కు మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తారు. ఈ ఏడాది శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది ఏడో సారి. ఎగువ నుంచి శ్రీశైలానికి 3.36 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. దాంతో భారీగా నీటిని దిగువకు […]
గత ఐదేళ్లుగా నీరసించిన కృష్ణమ్మ ఈ ఏడాది మాత్రం పదేపదే తెలుగు రాష్ట్రాల వైపు ఉరకలెత్తుతూ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడోసారి కృష్ణమ్మ భారీ వరదగా దూసుకొస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి 11.30కు మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తారు. ఈ ఏడాది శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది ఏడో సారి. ఎగువ నుంచి శ్రీశైలానికి 3.36 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. దాంతో భారీగా నీటిని దిగువకు వదులుతున్నారు.
జల విద్యుత్ కేంద్రం ద్వారా 68వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కృష్ణా నదికి 12 వందల 36 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎత్తిపోతల పథకాలకు కావాల్సినని నీరు లభించింది.
రాయలసీమకు జీవ నాడిలాంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఈసారి రికార్డు స్థాయిలో నీటిని సీమకు చేర్చింది. హంద్రీనీవా ద్వారా 12.37 టీఎంసీల నీరు, 130 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాంతానికి చేరింది.
సాధారణంగా కృష్ణా నదికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వరద వస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఎగువ నుంచి వరద వస్తూనే ఉంది. దాంతో అక్టోబర్‌లో కూడా శ్రీశైలం గేట్లు ఎత్తుతున్నారు. కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి.