Telugu Global
NEWS

ధూమ్ ధామ్ క్రికెట్లో సరికొత్త ప్రయోగం

టీ-20కి పోటీగా 100 బాల్స్ సమరం ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ లీగ్ లో…మరో వినూత్న ఆవిష్కరణకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెరతీసింది. టీ-20 ఫార్మాట్లో 120 బాల్స్ మ్యాచ్ లు ఉంటే.. కేవలం 100 బాల్స్ (16.4 ఓవర్లతోనే…) లీగ్ ను వచ్చే ఏడాది నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ లోని ఎనిమిది ప్రధానగరాల ఫ్రాంచైజీ జట్లతో 100-లీగ్ నిర్వహించడానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఇవీ 100 బాల్ జట్లు… 100 బాల్ […]

ధూమ్ ధామ్ క్రికెట్లో సరికొత్త ప్రయోగం
X
  • టీ-20కి పోటీగా 100 బాల్స్ సమరం

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ లీగ్ లో…మరో వినూత్న ఆవిష్కరణకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెరతీసింది. టీ-20 ఫార్మాట్లో 120 బాల్స్ మ్యాచ్ లు ఉంటే.. కేవలం 100 బాల్స్ (16.4 ఓవర్లతోనే…) లీగ్ ను వచ్చే ఏడాది నుంచి నిర్వహించాలని నిర్ణయించింది.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ లోని ఎనిమిది ప్రధానగరాల ఫ్రాంచైజీ జట్లతో 100-లీగ్ నిర్వహించడానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది.
ఇవీ 100 బాల్ జట్లు… 100 బాల్ లీగ్ లో తలపడే జట్లలో ట్రెంట్ రాకెట్స్, సదరన్ బ్రేవ్, నార్థరన్ సూపర్ చార్జర్స్, వేల్స్ ఫైర్, ఓవల్ ఇన్ వెన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ లండన్ స్పిరిట్, బర్మింగ్ హామ్ ఫీనిక్స్ ఉన్నాయి.

పురుషులు, మహిళల విభాగంలో ఏకకాలంలో 100 బాల్స్ లీగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

లండన్ స్పిరిట్ జట్టులో వోయిన్ మోర్గాన్, డాన్ లారెన్స్, రోరీ బర్న్స్, ఓవల్ ఇన్ వెన్సిబుల్స్ లో జేసన్ రాయ్, సామ్ కరెన్, టామ్ కరెన్ ఉన్నారు.

సదరన్ బ్రేవ్ జట్టులో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్సీ, వేల్స్ ఫైర్ జట్టులో జానీ బెయిర్ స్టో, టామ్ బాంటన్, కోలిన్ ఇంగ్రామ్ సభ్యులుగా ఉన్నారు.

నార్దర్న్ సూపర్ చార్జర్స్ జట్టులో బెన్ స్టోక్స్, అదిల్ రషీద్, డేవిడ్ విల్లే, మాంచెస్టర్ ఒరిజినల్స్ లో జోస్ బట్లర్, సకీబ్ మహ్మద్, మాట్ పార్కిన్ సన్, ట్రెంట్ రాకెట్స్ జట్టులో జో రూట్, అలెక్స్ హేల్స్, హారీ గుర్నే, బర్మింగ్ హామ్ ఫీనిక్స్ జట్టులో క్రిస్ వోక్స్, మోయిన్ అలీ, పాట్ బ్రౌన్ సభ్యులుగా ఎంపికయ్యారు.

ట్రెంట్ రాకెట్స్ జట్టులో రషీద్ ఖాన్..

100 లీగ్ కు ఎంపికైన తొలివిదేశీ క్రికెటర్ ఘనతను అప్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సొంతం చేసుకొన్నాడు. జో రూట్ నాయకత్వంలోని ట్రెంట్ రాకెట్స్ జట్టు రషీద్ ఖాన్ ను సొంతం చేసుకొంది. టీ-20 ఫార్మాట్లో 81 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్ కు 12.03 స్ట్రయిక్ రేట్ సైతం ఉంది.

కరీబియన్ థండర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ను సదరన్ బ్రేవ్, ఆరోన్ ఫించ్ ను నార్దర్న్ సూపర్ చార్జర్స్ దక్కించుకొంది. శ్రీలంక యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ, సఫారీ ఫాస్ట్ బౌలర్ కిర్గిసో రబాడా సైతం ఎంకయ్కారు.

కంగారూ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్, సునీల్ నరైన్ లను ఓవల్ ఇన్ వెన్సిబుల్స్ సొంతం చేసుకొన్నాయి.

సౌతాఫ్రికా జాదూ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్, డేన్ విలాస్ …మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో చేరారు.

కంగారూ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ లండన్ స్పిరిట్, లయమ్ లివింగ్స్ టన్ బర్మింగ్ హామ్ ఫీనిక్స్ జట్ల తరపున బరిలోకి దిగబోతున్నారు.

First Published:  23 Oct 2019 6:53 AM IST
Next Story