Telugu Global
NEWS

బాబు పాలనలో మహిళల ఆత్మగౌరవ భంగంలో ఏపీ నెంబర్‌ వన్‌- జాతీయ నేర గణాంక నివేదిక

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్‌ వన్‌గా ఉందని అప్పట్లో పలు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. బాబు రూలింగ్‌లో నేరాల్లోనూ ఏపీ అగ్రస్థానంలోనే ఉంటూ వచ్చింది. తాజాగా 2017 ఏడాది నేరాలపై జాతీయ నేర గణాంక సంస్థ నివేదికను వెల్లడించింది. 2017 అంటే అది చంద్రబాబు రూలింగ్. ఈ నివేదిక ప్రకారం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం, మహిళల పై దురాగతాలకు తెగబడడం వంటి నేరాల్లో 2017 ఏడాదిలో ఏపీ దేశంలోనే నెంబర్‌ 1 […]

బాబు పాలనలో మహిళల ఆత్మగౌరవ భంగంలో ఏపీ నెంబర్‌ వన్‌- జాతీయ నేర గణాంక నివేదిక
X

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్‌ వన్‌గా ఉందని అప్పట్లో పలు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. బాబు రూలింగ్‌లో నేరాల్లోనూ ఏపీ అగ్రస్థానంలోనే ఉంటూ వచ్చింది. తాజాగా 2017 ఏడాది నేరాలపై జాతీయ నేర గణాంక సంస్థ నివేదికను వెల్లడించింది.

2017 అంటే అది చంద్రబాబు రూలింగ్. ఈ నివేదిక ప్రకారం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం, మహిళల పై దురాగతాలకు తెగబడడం వంటి నేరాల్లో 2017 ఏడాదిలో ఏపీ దేశంలోనే నెంబర్‌ 1 స్థానంలో నిలిచింది.

మహిళల ఆత్మగౌరవ భంగానికి సంబంధించి దేశం మొత్తం జరిగిన నేరాల్లో…. ఒక్క ఏపీలోనే 7.7 శాతం జరిగాయి. 2017 ఏడాదిలో వృద్ధ తల్లిదండ్రులపై దాడుల చేసిన ఉదంతాల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది.

2017లో ఎస్సీలపై ఏపీలో భారీగా దాడులు నమోదు అయ్యాయి. దళితులపై దాడుల్లో ఆ ఏడాది ఏపీ ఐదవ స్థానాన్ని సొంతం చేసుకుంది.

2017లో దేశంలో అత్యధిక నేరాలు జరిగిన రాష్ట్రాల్లో ఏపీ టాప్ 10లో నిలిచింది.

2017లో లక్షా 31 వేల మంది వివిధ నేరాల్లో అరెస్ట్ కాగా… వారిలో 89. 4 శాతం మంది కొత్తగా నేరాల్లోకి ఎంటరైన వారే. లా అండ్ ఆర్డర్‌ బలహీనంగా ఉన్నప్పుడే ఇలా కొత్తవారు ఎక్కువగా నేరాలకు పాల్పడేందుకు సాహసిస్తుంటారని చెబుతున్నారు.

First Published:  23 Oct 2019 5:30 AM IST
Next Story