రాజధానిలో 30వేల కోట్ల దుబారా " పీటర్ కమిటీ రిపోర్టు
ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీటర్ కమిటీ నివేదికను అందజేసింది. పలు కీలక అంశాలను కమిటీ గుర్తించింది. రాజధానిలోని ప్రతి ప్రాజెక్టును సమీక్షించాల్సిందేనని అభిప్రాయపడింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని నిపుణుల కమిటీ తేల్చింది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కమిటీ నిగ్గు తేల్చింది. రాజధాని నిర్మాణాల్లో 30వేల కోట్లకు పైగా దుబారా ఖర్చు ఉన్నట్టు కమిటీ తేల్చింది. ఇప్పటికే జరుగుతున్న నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వానికే కమిటీ వదిలేసింది. […]
ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీటర్ కమిటీ నివేదికను అందజేసింది. పలు కీలక అంశాలను కమిటీ గుర్తించింది. రాజధానిలోని ప్రతి ప్రాజెక్టును సమీక్షించాల్సిందేనని అభిప్రాయపడింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని నిపుణుల కమిటీ తేల్చింది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కమిటీ నిగ్గు తేల్చింది.
రాజధాని నిర్మాణాల్లో 30వేల కోట్లకు పైగా దుబారా ఖర్చు ఉన్నట్టు కమిటీ తేల్చింది. ఇప్పటికే జరుగుతున్న నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వానికే కమిటీ వదిలేసింది.
వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన ఎఫ్‌సీఎస్ పీటర్, పొన్నాడ సూర్యప్రకాష్, అబ్దుల్ బషీర్, ఎల్.నారాయణరెడ్డి, ఐఎస్‌ఎన్ రాజు, ఆదిశేషు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ రాజధాని అంశంపై లోతుగా పరిశీలన చేసి ఈ నివేదికను అందజేసింది.