Telugu Global
National

హోంగార్డుకు 30 లక్షలు, కానిస్టేబుల్‌కు 40 లక్షల ఇన్సురెన్స్ కవరేజ్

లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడ వద్దని పోలీసులకు సూచించారు. తప్పు చేసిన వారినెవరినైనా సరే చట్టం ముందు నిలబెట్టాల్సిందిగా ఎస్పీలతో జరిగిన తొలి సమావేశంలో తాను ఆదేశించానని చెప్పారు. న్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌ నుంచి బాధితుడు చిరునవ్వుతో వెళ్లినప్పుడే పోలీసు […]

హోంగార్డుకు 30 లక్షలు, కానిస్టేబుల్‌కు 40 లక్షల ఇన్సురెన్స్ కవరేజ్
X

లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడ వద్దని పోలీసులకు సూచించారు.

తప్పు చేసిన వారినెవరినైనా సరే చట్టం ముందు నిలబెట్టాల్సిందిగా ఎస్పీలతో జరిగిన తొలి సమావేశంలో తాను ఆదేశించానని చెప్పారు. న్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌ నుంచి బాధితుడు చిరునవ్వుతో వెళ్లినప్పుడే పోలీసు వ్యవస్థకు గౌరవం పెరుగుతుందన్నారు. అందరికీ చట్టం ఒకేలా పనిచేస్తేనే వ్యవస్థలో న్యాయం, ధర్మం బతికే అవకాశం ఉంటుందన్నారు.

చట్టం ఏ కొందరికో చుట్టం అవడానికి వీల్లేదన్నారు. అలా అవకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. ప్రజల కోసం హోంగార్డుల నుంచి డీజీపీ వరకు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదన్నారు. అందుకే దేశంలోనే మొట్టమొదటి సారి పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు.

వారంలో ఒకరోజు కుటుంబసభ్యులతో గడపగలిగితే పోలీసుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్న ఉద్దేశంతోనే వీక్లీ ఆఫ్ ఇచ్చినట్టు చెప్పారు. అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తన ఉన్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరారు. రాష్ట్రంలో పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని… వారికి సరైన న్యాయం చేస్తామన్నారు.

హోంగార్డుల జీతాలను 18వేల నుంచి 21వేలకు పెంచామన్నారు. విధి నిర్వాహణలో హోంగార్డు మరణిస్తేతే 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాతో పాటు… 30 లక్షల రూపాయల ఇన్సురెన్స్ కవరేజ్ తెచ్చామన్నారు. కానిస్టేబుల్‌ విధుల్లో మరణిస్తే 40 లక్షల రూపాయల ఇన్సురెన్స్‌ కవరేజ్‌ను తెచ్చామన్నారు.

First Published:  21 Oct 2019 3:43 AM IST
Next Story