Telugu Global
NEWS

టెస్టు క్రికెట్లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ

డాన్ బ్రాడ్మన్ ను అధిగమించిన రోహిత్ సిరీస్ లో 500 పరుగుల రోహిత్ శర్మ భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం రికార్డుల మోత మోగించాడు. తొలి డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు. రాంచీ లోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజు ఆటలో రోహిత్ ద్విశతకం బాదాడు. టెస్టుల్లో తొలి డబుల్… టెస్టు క్రికెట్లో ఓపెనర్ గా తన కెరియర్ లో కేవలం మూడోటెస్టు మాత్రమే […]

టెస్టు క్రికెట్లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ
X
  • డాన్ బ్రాడ్మన్ ను అధిగమించిన రోహిత్
  • సిరీస్ లో 500 పరుగుల రోహిత్ శర్మ

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం రికార్డుల మోత మోగించాడు. తొలి డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు.

రాంచీ లోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజు ఆటలో రోహిత్ ద్విశతకం బాదాడు.

టెస్టుల్లో తొలి డబుల్…

టెస్టు క్రికెట్లో ఓపెనర్ గా తన కెరియర్ లో కేవలం మూడోటెస్టు మాత్రమే ఆడుతున్న రోహిత్ తొలి ద్విశతకం నమోదు చేశాడు. మొత్తం 255బాల్స్ ఎదుర్కొని 28 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 212 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

రోహిత్ టెస్ట్ కెరియర్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

డాన్ ను మించిన రోహిత్ శర్మ…

ప్రస్తుత తీన్మార్ టెస్ట్ సిరీస్ లో రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ సాధించడం ద్వారా…రోహిత్ శర్మ….క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న అత్యుత్తమ సగటు రికార్డును అధిగమించాడు.

స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో డాన్ బ్రాడ్మన్ సాధించిన 98.22 సగటు రికార్డును రోహిత్ శర్మ99.84 సగటుతో అధిగమించాడు. గత 71 సంవత్సరాలుగా డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న అత్యధిక సగటు రికార్డును రోహిత్ తెరమరుగు చేశాడు.

సిక్సర్ల బాదుడులో రోహిత్ టాప్…

టెస్టు క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ తనపేరుతో లిఖించుకొన్నాడు.

వెస్టిండీస్ మిడిలార్డర్ ఆటగాడు సిమ్ రాన్ హెట్ మేయర్ పేరుతో ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. బంగ్లాదేశ్ తో ముగిసిన 2018-19 టెస్టు సిరీస్ లో హెట్ మేయర్ 15 సిక్సర్లు బాదడం ద్వారా రికార్డు సాధించాడు. ఆ రికార్డును రోహిత్ శర్మ 19 సిక్సర్లతో తెరమరుగు చేశాడు.

హేమాహేమీల సరసన రోహిత్…

ఓ క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు సాధించిన మరో నలుగురు దిగ్గజ ఓపెనర్ల సరసన రోహిత్ శర్మ చోటు సంపాదించాడు.

1998 సీజన్లో సచిన్.. 33 మ్యాచ్ ల్లో 9 శతకాలు బాదితే…2005లో సౌతాఫ్రికా కెప్టెన్ గ్రీమ్ స్మిత్ 34 టెస్టుల్లో 9 సెంచరీలు, 2016 సీజన్లో ఆస్ట్ర్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 37 టెస్టుల్లో 9 సెంచరీలు, 2019 సీజన్లో రోహిత్ శర్మ 9 సెంచరీలు సాధించి ..మొదటి నాలుగుస్థానాల్లో నిలిచారు. 1996లో సౌతాఫ్రికా ఓపెనర్ గ్యారీ కిర్ స్టెన్ 32 టెస్టుల్లో 8 సెంచరీలతో ఉన్నాడు.

భారత 5వ ఓపెనర్ రోహిత్..

వన్డే క్రికెట్ తో పాటు టెస్టు క్రికెట్లో సైతం డబుల్ సెంచరీలు నమోదు చేసిన భారత మాజీ ఓపెనర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ల సరసన రోహిత్ శర్మ నిలిచాడు.

ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో 500 పరుగులు సాధించిన భారత 5వ ఓపెనర్ గా కూడా రోహిత్ రికార్డుల్లో చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, బుదీ కుందరన్ గతంలోనే..ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లుగా ఉన్నారు.

స్వదేశీ సిరీస్ ల్లో రోహిత్ జోరు…

భారత గడ్డపై రోహిత్ శర్మ ఆడిన మొత్తం 18 ఇన్నింగ్స్ లో 6 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించడమే కాదు…గత తొమ్మిది ఇన్నింగ్స్ లో 82 నాటౌట్, 51 నాటౌట్, 102 నాటౌట్, 65, 50 నాటౌట్, 176, 127, 14, 212 స్కోర్లు నమోదు చేశాడు.

ప్రస్తుత రాంచీ టెస్టు వరకూ సొంతగడ్డపై రోహిత్ ఆడిన మొత్తం 30 టెస్టుల్లో 2019 పరుగులు సాధించడం విశేషం.

మొత్తం మీద జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్టు మొదటిరెండురోజుల ఆటలోనే రోహిత్ శర్మ సూపర్ డబుల్ తో రికార్డుల మోత మోగించడం విశేషం.

First Published:  21 Oct 2019 1:14 AM IST
Next Story