Telugu Global
National

హుజూర్‌నగర్‌పై ఆరా సర్వే... ఆ పార్టీకి దిమ్మతిరిగినట్టే...

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ప్రముఖ సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన సర్వే రిపోర్టును వెల్లడించింది. ఈ సంస్థ సర్వే ప్రకారం హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతోంది. గతంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన ఎంపీగా గెలవడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి సోమవారం పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి […]

హుజూర్‌నగర్‌పై ఆరా సర్వే... ఆ పార్టీకి దిమ్మతిరిగినట్టే...
X

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ప్రముఖ సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన సర్వే రిపోర్టును వెల్లడించింది. ఈ సంస్థ సర్వే ప్రకారం హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతోంది.

గతంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన ఎంపీగా గెలవడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి సోమవారం పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేశారు. టీఆర్‌ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు.

పోలింగ్ ముగిసిన తర్వాత ప్రముఖ సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఈ ఆరా సర్వే అటు తెలంగాణ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు నిజమైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని లగడపాటి చెప్పగా… ఆరా సంస్థ మాత్రం టీఆర్‌ఎస్‌కు 75 నుంచి 85 వరకు సీట్లు వస్తాయని చెప్పింది. చివరకు ఆరా సర్వేనే నిజమైంది.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ఈ సర్వే చెబుతోంది. టీఆర్‌ఎస్‌కు ఏకంగా 50.48 శాతం ఓట్లు వస్తాయని ఆరా సర్వే చెబుతోంది. కాంగ్రెస్‌కు 39.95 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఇతర పార్టీల అభ్యర్థులకు 9.57 శాతం ఓట్లు వస్తాయని ఆరా సర్వే వెల్లడించింది.

ఈ సర్వే బట్టి చూస్తే టీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ కు మధ్య దాదాపు 10 శాతం ఓట్ల తేడా ఉన్నట్టుగా ఉంది. సగానికి పైగా ఓట్లు టీఆర్‌ఎస్ సాధించబోతోంది. హుజూర్ నగర్ స్థానం కాంగ్రెస్ ఖాతా నుంచి టీఆర్‌ఎస్ ఖాతాలోకి పడబోతోంది.

First Published:  21 Oct 2019 12:42 PM IST
Next Story