రిలయన్స్‌లోకి చౌదరి... దర్యాప్తుకు ఏచూరి డిమాండ్
కేంద్ర విజిలెన్స్ మాజీ చీఫ్ కమిషనర్ కేవీ చౌదరి రిలయన్స్ గ్రూపులో కొలువు సాధించడం సంచలనంగా మారింది. ఆయనను రిలయన్స్ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ను నాన్ ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా నియమిస్తూ రిలయన్స్ బోర్టు సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ సంస్థలకు కూడా తెలియజేసింది. స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసే కేవీ చౌదరికి సంస్థలోని ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం ఉండదని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. కేవీ చౌదరి రిలయన్స్ […]

కేంద్ర విజిలెన్స్ మాజీ చీఫ్ కమిషనర్ కేవీ చౌదరి రిలయన్స్ గ్రూపులో కొలువు సాధించడం సంచలనంగా మారింది. ఆయనను రిలయన్స్ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ను నాన్ ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా నియమిస్తూ రిలయన్స్ బోర్టు సమావేశం ఆమోద ముద్ర వేసింది.
ఈ విషయాన్ని రెగ్యులేటరీ సంస్థలకు కూడా తెలియజేసింది. స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసే కేవీ చౌదరికి సంస్థలోని ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం ఉండదని రిలయన్స్ సంస్థ ప్రకటించింది.
కేవీ చౌదరి రిలయన్స్ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులవడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారిగా, మోడీ ప్రభుత్వంలో పన్నుల శాఖకు మొట్టమొదటి అధికారిగా పనిచేసిన కేవీ చౌదరికి ఆర్‌ఐఎల్‌లో బాధ్యతలు ఎలా దక్కాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖ అధికారులుగా పనిచేసిన వారు పదవుల్లో ఉండగా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం, పదవి విరమణ చేయగానే సదరు కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవులు తీసుకోవడం అలవాటుగా మారిందని సీపీఎం ఆరోపించింది.
కేవీ చౌదరి… రిలయన్స్‌లో కీలక పదవి సాధించిన నేపథ్యంలో ఆయన సీవీసీగా ఉన్న సమయంలో రిలయన్స్ సంస్థకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని ఏచూరి డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేవీ చౌదరి స్వస్థలం కృష్ణా జిల్లా.