మత ప్రచారకుడిపై వలపుల వల... ఫొటోలతో బ్లాక్‌మెయిల్
హైదరాబాద్‌లో ఒక మహిళ హనీట్రాప్ విసిరింది. ఈ ట్రాప్‌లో ఒక మత ప్రచారకుడు చిక్కుకున్నాడు. ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన మహిళ, తన భర్తతో కలిసి ఈ పని చేసింది. గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన 25 ఏళ్ల మహిళ భర్త గతంలో హైదరాబాద్‌లో పలు హోటళ్లు నిర్వహించాడు. వాటిలో భారీగా నష్టాలు రావడంతో బ్లాక్‌మెయిల్ దందాకు దిగారు. గతంలోనూ ఒక ఎన్‌ఆర్‌ఐను ఇదే తరహాలో మోసం చేసి డబ్బులు వసూలు చేశారు. ఇటీవల మొయినాబాద్‌లో ఉంటున్న ఒక మత ప్రచారకుడిని […]
హైదరాబాద్‌లో ఒక మహిళ హనీట్రాప్ విసిరింది. ఈ ట్రాప్‌లో ఒక మత ప్రచారకుడు చిక్కుకున్నాడు. ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన మహిళ, తన భర్తతో కలిసి ఈ పని చేసింది. గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన 25 ఏళ్ల మహిళ భర్త గతంలో హైదరాబాద్‌లో పలు హోటళ్లు నిర్వహించాడు. వాటిలో భారీగా నష్టాలు రావడంతో బ్లాక్‌మెయిల్ దందాకు దిగారు. గతంలోనూ ఒక ఎన్‌ఆర్‌ఐను ఇదే తరహాలో మోసం చేసి డబ్బులు వసూలు చేశారు.
ఇటీవల మొయినాబాద్‌లో ఉంటున్న ఒక మత ప్రచారకుడిని ఈమె టార్గెట్ చేసుకుంది. అతడి ప్రార్థన మందిరానికి పదేపదే వెళ్లి పరిచయం చేసుకుంది. తాను సికింద్రాబాద్‌లో చిన్నారుల ఆశ్రమం నడుపుతుంటానని నమ్మించింది. వాట్సప్‌లో చాటింగ్ మొదలుపెట్టింది. పలుమార్లు రెస్టారెంట్లకు ఆహ్వానించింది. వీరు రెస్టారెంట్లలో ఉన్నప్పుడు ఆమె వెంట వచ్చిన వారు రహస్యంగా ఫొటోలు తీసేవారు. అలా తనపై అతడికి బాగా నమ్మకం ఏర్పడిన తర్వాత అసలు ప్లాన్ అమలు చేసింది. తన భర్త విజయవాడలో హోటల్ పెడుతున్నారని అందులో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటూ మత ప్రచారకుడి చేత 10 లక్షలు పెట్టుబడి పెట్టించింది.
వ్యాపార చర్చల కోసం ప్రతినిధులు వస్తున్నారంటూ గత నెలలో శంకర్‌పల్లి ప్రాంతంలోని ఒక రిసార్ట్‌కు మత ప్రచారకుడిని రప్పించింది. అతడు ప్రతినిధుల కోసం వేచి చూస్తుండగా రాత్రి పూట హఠాత్తుగా ఈ లేడినే ప్రత్యక్షమైంది. మాటలు కలిపింది. ముగ్గులోకి దింపింది. ఇద్దరూ కలిసి గదిలో ఏకాంతంగా గడిపారు. అదే సమయంలో అతడికి మత్తు మందు ఇచ్చింది. అతడు సృహ కోల్పోగానే బెడ్‌మీద ఇద్దరూ ఉన్నప్పటి ఫొటోలను తీయించింది. అనంతరం అతడిని బాత్రూంలో టబ్‌లో పడుకోబెట్టారు.
ఉదయం మత్తు నుంచి బయటకు వచ్చిన మత ప్రచారకుడు తాను టబ్‌లో ఉండడం చూసి కంగుతిన్నాడు. ఇంతలో ముందస్తు ప్రణాళికలో భాగంగా హఠాత్తుగా అక్కడికి వచ్చిన కిలాడి భర్త… మత ప్రచారకుడిపై దాడి చేశాడు. తన భార్యను కూడా నాటకంలో భాగంగా నాలుగు దెబ్బలు కొట్టాడు. కోటి రూపాయలు ఇవ్వాలని లేకుంటే తన భార్యను రేప్ చేసినట్టు కేసు పెడుతామంటూ బెదిరించాడు. భయపడిపోయిన అతడు డబ్బులు ఇచ్చేందుకు కాగితాలపై సంతకాలు కూడా చేశాడు. తొలి విడతలో భాగంగా 20 లక్షలు ఇచ్చాడు. మిగిలిన డబ్బు కోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో మత ప్రచారకుడు పోలీసులను ఆశ్రయించి… జరిగింది చెప్పాడు.
రంగంలోకి దిగిన పోలీసులు కిలాడి భార్య భర్తలను అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు మత ప్రచారకుడిని బెదిరించడానికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దాంతో నాటకం మొత్తం బయటపడింది. బెదిరింపుకు వాడిన తుపాకి బొమ్మ తుపాకీ అని…. దాన్ని నాంపల్లిలోని బొమ్మల దుకాణంలో కొనుగోలు చేసినట్టు అంగీకరించారు.