Telugu Global
NEWS

బాబు బ్యాచ్‌కు చెక్... అందరినీ తొలగించాలని ఆదేశం

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వంలో తిష్టవేసి భారీగా జీతాలు తీసుకుంటున్న వారిని తక్షణం తొలగించాలని ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు స్వస్తి పలకాలని అన్ని డిపార్ట్‌మెంట్లకు ఆదేశించింది. ఇలా తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులంతా చంద్రబాబు హయాంలో నియమితులైన వారే. వీరంతా టీడీపీ సానుభూతిపరులని అందుకే భారీగా జీతాలు ఇచ్చి చంద్రబాబు వీరిని నియమించినట్టు చెబుతున్నారు. వీరి వల్ల […]

బాబు బ్యాచ్‌కు చెక్... అందరినీ తొలగించాలని ఆదేశం
X

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వంలో తిష్టవేసి భారీగా జీతాలు తీసుకుంటున్న వారిని తక్షణం తొలగించాలని ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు స్వస్తి పలకాలని అన్ని డిపార్ట్‌మెంట్లకు ఆదేశించింది.

ఇలా తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులంతా చంద్రబాబు హయాంలో నియమితులైన వారే. వీరంతా టీడీపీ సానుభూతిపరులని అందుకే భారీగా జీతాలు ఇచ్చి చంద్రబాబు వీరిని నియమించినట్టు చెబుతున్నారు. వీరి వల్ల కొత్త ప్రభుత్వానికి పాలనలో కూడా అనేక ఇబ్బందులు వస్తున్నాయి.వీరు పాలనకు సహకరించకపోగా… ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

రిటైర్డ్ ఉద్యోగులతో పాటు… 40వేలు, ఆపై జీతాలు తీసుకుంటూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఎలాంటి ఎంపిక ప్రక్రియ లేకుండానే గత ప్రభుత్వం నియమించబడిన వారిని కూడా తొలగించాలని ఆదేశించింది. తక్షణం ఈ తొలగింపులను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది.

ప్రభుత్వం మారిన తర్వాత కూడా అనేక శాఖల్లో చంద్రబాబు మనుషులే హవా చెలాయిస్తుండడంపై వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాయి.

First Published:  20 Oct 2019 2:04 AM IST
Next Story