ఇది కూడా రీమేక్... కానీ చెప్పడు
ఒకప్పుడు రీమేక్ అంటే గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఫలానా భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామంటూ ఘనంగా ప్రకటించుకునేవాళ్లు. కానీ ఇప్పుడీ ట్రెండ్ పూర్తిగా పోయింది. ఏ భాషలో సినిమాలైనా డిజిటల్ వేదికలపై అన్ని భాషల ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తున్న నేపథ్యంలో.. రీమేక్ అని చెబితే ముందుగానే బజ్ చేజారిపోతోంది. అందుకే మేకర్స్ ఎవరూ తమ సినిమా రీమేక్ అని చెప్పడం లేదు. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజుగారి గది 3 కూడా చేరింది. […]
ఒకప్పుడు రీమేక్ అంటే గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఫలానా భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామంటూ ఘనంగా ప్రకటించుకునేవాళ్లు. కానీ ఇప్పుడీ ట్రెండ్ పూర్తిగా పోయింది. ఏ భాషలో సినిమాలైనా డిజిటల్ వేదికలపై అన్ని భాషల ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తున్న నేపథ్యంలో.. రీమేక్ అని చెబితే ముందుగానే బజ్ చేజారిపోతోంది. అందుకే మేకర్స్ ఎవరూ తమ సినిమా రీమేక్ అని చెప్పడం లేదు. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజుగారి గది 3 కూడా చేరింది.
తమిళ్ లో వచ్చిన దిల్లుకు దుడ్డు 2 అనే సినిమాకు రీమేక్ గా రాజుగారి గది 3ను తెరకెక్కించారు. కానీ ఆ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు చెప్పలేదు మేకర్స్. చివరికి ప్రచారంలో భాగంగా విడుదలకు ముందు రోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు గట్టిగా అడగడంతో దర్శకుడు ఓంకార్ కు నిజం ఒప్పుకోలేక తప్పలేదు. అలా ఈ సినిమాను రీమేక్ అని ఒప్పుకున్న ఓంకార్.. కేవలం కథను మాత్రమే తీసుకున్నామని… కామెడీని, సన్నివేశాల్ని పూర్తిగా మార్చేశామని చెబుతున్నాడు.
ఇప్పటికే వచ్చిన ఎవరు, మన్మథుడు 2 లాంటి సినిమాలన్నీ రీమేక్ ప్రాజెక్టులే. కానీ ఆ విషయాన్ని మేకర్స్ ముందుగా ఎనౌన్స్ చేయలేదు. రిలీజ్ కు ముందు మాత్రమే బయటపెట్టారు. ఇప్పుడీ కోవలో రాజుగారి గది 3 కూడా వచ్చిందన్నమాట.