Telugu Global
NEWS

రాంచీలో నేటినుంచే ఆఖరిటెస్ట్

క్లీన్ స్వీప్ కు గురిపెట్టిన భారత్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా..టాప్ ర్యాంకర్ భారత్, మూడో ర్యాంకర్ సౌతాఫ్రికాజట్ల నడుమ జరుగుతున్న తీన్మార్ టెస్ట్ సిరీస్ లోని ఆఖరాటకు రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. శనివారం నుంచి ఐదురోజులపాటు జరుగనున్న ఈ మ్యాచ్ భారత్ కు చెలగాటం…సఫారీలకు పరాజయాల హ్యాట్రిక్ సంకటంగా మారింది. మొదటి రెండుటెస్టుల్లో భారీవిజయాలు సాధించడం ద్వారా ఇప్పటికే సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్..మూడోవిజయం కోసం తహతహలాడుతోంది. 200 […]

రాంచీలో నేటినుంచే ఆఖరిటెస్ట్
X
  • క్లీన్ స్వీప్ కు గురిపెట్టిన భారత్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా..టాప్ ర్యాంకర్ భారత్, మూడో ర్యాంకర్ సౌతాఫ్రికాజట్ల నడుమ జరుగుతున్న తీన్మార్ టెస్ట్ సిరీస్ లోని ఆఖరాటకు రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

శనివారం నుంచి ఐదురోజులపాటు జరుగనున్న ఈ మ్యాచ్ భారత్ కు చెలగాటం…సఫారీలకు పరాజయాల హ్యాట్రిక్ సంకటంగా మారింది.

మొదటి రెండుటెస్టుల్లో భారీవిజయాలు సాధించడం ద్వారా ఇప్పటికే సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్..మూడోవిజయం కోసం తహతహలాడుతోంది.

200 పాయింట్లతో టాప్…

టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన నాలుగుకు నాలుగుటెస్టుల్లో నెగ్గడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ భారత్ 200 పాయింట్లతో తొమ్మిదిజట్ల లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత సిరీస్ లోని ఆఖరిటెస్టును సైతం నెగ్గడం ద్వారా మరో 40 పాయింట్లు ఖాతాలో వేసుకోగలమన్న ధీమా భారత కెప్టెన్ కొహ్లీలో కనిపిస్తోంది.

సఫారీలకు టెన్షన్ టెన్షన్…

డూప్లెసీ నాయకత్వంలోని సౌతాఫ్రికాజట్టు వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. దీనికితోడు యువఆటగాళ్లు మర్కరమ్, కేశవ్ మహారాజ్ గాయాలతో జట్టుకు దూరం కావడంతో…సఫారీటీమ్ పరిస్థితి మూలిగేనక్కమీద తాటిపండు పడిన చందంగా మారింది.

ఆసియా ఉపఖండ దేశాలలో ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో వరుసగా తొమ్మిది టాస్ లు ఓడిన సౌతాఫ్రికా కెప్టెన్ డూప్లెసీ…రాంచీ టెస్టులో టాస్ వేయటానికి తనకు బదులుగా మరొక ఆటగాడిని పంపే అవకాశం లేకపోలేదు.

తొలిఇన్నింగ్స్ లో భారీస్కోరు సాధించగలిగితేనే తాము భారత్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని రాంచీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు.

హమ్జా, జార్జి లిండ్, ఎన్ రిచ్ సెకండ్, లుంగీ ఎంగిడీ లాంటి రిజర్వ్ ఆటగాళ్లకు తుదిజట్టులో అవకాశం కల్పించే యోచనలో సఫారీ టీమ్ మేనేజ్ మెంట్ ఉంది.

స్పిన్నర్ల స్వర్గం రాంచీ వికెట్…

మొదటి రెండుటెస్టు వేదికలకు భిన్నంగా రాంచీ స్టేడియం పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో…అదనపు పేసర్ ను తప్పించి…తుదిజట్టులోకి.. అదనపు స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.

టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ మొదటినాలుగురోజుల్లోనే ముగిసిపోతుందా…లేక.. ఐదురోజులపాటు సౌతాఫ్రికాజట్టు పోటీలో ఉంటుందా…తెలుసుకోవాలంటే టెస్ట్ ముగిసేవరకూ వేచిచూడక తప్పదు.

First Published:  19 Oct 2019 12:32 AM IST
Next Story