Telugu Global
National

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ శరద్ అర్వింద్

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం సీజేఐ రంజన్ గొగొయ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. జస్టీస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండటంతో తదుపరి సీజేఐ నియామకం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం సీనియార్టీలో రంజన్ తర్వాత స్థానంలో శరద్ అర్వింద్ బాబ్డేనే ఉన్నారు. కొత్త సీజేఐ నియామకానికి సంబంధించి ఎన్నో ఏండ్లుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం.. ప్రస్తుత సీజేఐ […]

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ శరద్ అర్వింద్
X

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం సీజేఐ రంజన్ గొగొయ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. జస్టీస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండటంతో తదుపరి సీజేఐ నియామకం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రస్తుతం సీనియార్టీలో రంజన్ తర్వాత స్థానంలో శరద్ అర్వింద్ బాబ్డేనే ఉన్నారు. కొత్త సీజేఐ నియామకానికి సంబంధించి ఎన్నో ఏండ్లుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం.. ప్రస్తుత సీజేఐ ఒకరిని ప్రతిపాదించాలి. దీంతో అర్వింద్ బాబ్డేను గొగొయ్ ప్రతిపాదించారు.

ఇక బాబ్డే 24 ఏప్రిల్ 1956లో నాగ్‌పూర్‌లో జన్మించారు. మహారాష్ట్ర లా యూనివర్సిటీ ఛాన్సలర్‌గా, మధ్యప్రదేశ్ హైకోర్టు ఛీఫ్ జస్టీస్‌గా ఆయన పని చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

కాగా, రంజన్ గొగొయ్ చివరి పని దినం నాడే ఆయోధ్య తీర్పు చెప్పాల్సి ఉంది.

First Published:  18 Oct 2019 9:12 AM IST
Next Story