బిజీ అంటూ గవర్నర్ వద్దకు వెళ్లని మంత్రి
ఆర్టీసీ సమ్మె తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. చాలా ఏళ్లుగా నిరాశతో ఉన్న ప్రతిపక్షాలు ఈ సమ్మె ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు గట్టిగానే సిద్దమయ్యాయి. ఇప్పటికే సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఆరా తీస్తోంది. గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలకు నివేదికలు పంపుతున్నారు. ప్రతిపక్ష నాయకులు, ఆర్టీసీ సంఘాలు కూడా గవర్నర్ వద్దకు వెళ్లి కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ […]
ఆర్టీసీ సమ్మె తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. చాలా ఏళ్లుగా నిరాశతో ఉన్న ప్రతిపక్షాలు ఈ సమ్మె ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు గట్టిగానే సిద్దమయ్యాయి. ఇప్పటికే సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఆరా తీస్తోంది. గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలకు నివేదికలు పంపుతున్నారు.
ప్రతిపక్ష నాయకులు, ఆర్టీసీ సంఘాలు కూడా గవర్నర్ వద్దకు వెళ్లి కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు కేసీఆర్ ముందే చొరవ తీసుకుని పరిస్థితిని గవర్నర్‌కు వివరించేవారు. స్వయంగా ఆయనే గవర్నర్ వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపేవారు.
కానీ తమిళసై విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అందుకు భిన్నంగానే వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. స్వయంగా గవర్నర్ తమిళసై… తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గవర్నర్ నుంచి ఫోన్ రావడంతో సమ్మె గురించి వివరించేందుకు స్వయంగా మంత్రే ఆమె వద్దకు వెళ్తారని భావించారు. కానీ అలా జరగలేదు. సమ్మెకు సంబంధించిన అంశాలను కేసీఆర్‌కు తాను వివరించాల్సి ఉందని కాబట్టి తాను రాజ్‌భవన్‌కు రాలేనని… పరిస్థితిని వివరించేందుకు అధికారులను పంపుతామని మంత్రి స్పష్టం చేశారు.
అన్నట్టుగానే ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ శర్మను గవర్నర్ వద్దకు పంపారు. ఆయన సమ్మె గురించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి గవర్నర్‌కు వివరించారు.