కేసీఆర్ సభ రద్దు.. కారణం చెప్పిన విజయశాంతి
హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సభ చివరి నిమిషంలో రద్దు అయ్యింది. దీనికి వర్షం సహా ఎన్నో కారణాలను చెప్పారు. అయితే సభ రద్దు అవ్వడం వెనుక వేరే కారణం ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి బాంబు పేల్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కేసీఆర్ పర్యటనను వాయిదా వేసుకున్నారని రాములమ్మ ఆరోపించారు. కేసీఆర్ నిజంగా హుజూర్ నగర్ కు రావాలని అనుకుంటే […]
హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సభ చివరి నిమిషంలో రద్దు అయ్యింది. దీనికి వర్షం సహా ఎన్నో కారణాలను చెప్పారు.
అయితే సభ రద్దు అవ్వడం వెనుక వేరే కారణం ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి బాంబు పేల్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కేసీఆర్ పర్యటనను వాయిదా వేసుకున్నారని రాములమ్మ ఆరోపించారు.
కేసీఆర్ నిజంగా హుజూర్ నగర్ కు రావాలని అనుకుంటే రోడ్డు మార్గం ద్వారా కూడా రావచ్చని… విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే కార్మికుల నుంచి చేదు అనుభవం ఎదురవుతుందనే కేసీఆర్ భయపడ్డారని.. అందుకే హెలీకాప్టర్ ద్వారా రావాలని చూసినా సాధ్యపడలేదని విజయశాంతి విమర్శించారు.
సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని హుజూర్ నగర్ లో ఓటమిని అంగీకరించినట్లేనని విజయశాంతి వ్యాఖ్యానించారు.
కాగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల వల్ల సీఎం హెలీక్యాప్టర్ పర్యటన రద్దు చేసినట్లు ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. కానీ ఈ ప్రకటనను మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు, విజయశాంతి ఖండించారు. నిరసనలకు భయపడే కేసీఆర్ రాలేదని స్పష్టం చేశారు.