కేకే రాజ్యసభ రెన్యూవల్ లేదా?
టీఆర్ఎస్‌లో కేశవరావు ఇష్యూ చర్చగా మారింది. ఆరేళ్లుగా సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు లేఖలతో కలకలం సృష్టిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేకే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ సమ్మె పై కొందరు మంత్రులు మాట్లాడినా ఎవరూ చర్చలకు రావాలి…. ప్రభుత్వం పరిశీలిస్తుందని మాట్లాడలేదు. కానీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు మాత్రం ప్రెస్ నోట్, చిట్ చాట్ లతో సంచలనం సృష్టించారు. తాను కార్మిక పక్షపాతి అని.. సీఎం ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికుల తో […]
టీఆర్ఎస్‌లో కేశవరావు ఇష్యూ చర్చగా మారింది. ఆరేళ్లుగా సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు లేఖలతో కలకలం సృష్టిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేకే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ సమ్మె పై కొందరు మంత్రులు మాట్లాడినా ఎవరూ చర్చలకు రావాలి…. ప్రభుత్వం పరిశీలిస్తుందని మాట్లాడలేదు.
కానీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు మాత్రం ప్రెస్ నోట్, చిట్ చాట్ లతో సంచలనం సృష్టించారు. తాను కార్మిక పక్షపాతి అని.. సీఎం ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికుల తో చర్చలు జరుపుతాం అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చి విపక్షాలకు ఆయుధం ఇచ్చారు.
అయితే కేశవరావు ఇలా ఎందుకు చేశారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తన రాజ్యసభ సీటు పదవి రెన్యూవల్ విషయం లో గులాబీ బాస్ నుండి స్పష్టత రాకే ఇలా చేసాడు అంటూ టిఆర్ఎస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి.
2014 ఏప్రిల్ లో రాజ్యసభకు కేకే ఎన్నికయ్యారు. 2020 ఏప్రిల్ లో ఆయన పదవీకాలం ముగుస్తోంది. దీంతో పదవి రెన్యూవల్ కోసం కేసీఆర్ ను కేకే కలిశారట. అయితే ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. దీంతో కేకే తన దారి తాను చూసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన కారు దిగి వేరే గూటికి వెళ్తారు అని ప్రచారం జరుగుతోంది.
టీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిలో డీఎస్ ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలింది సంతోష్ కుమార్. ఆయన కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్. లక్ష్మీకాంతారావు కేసీఆర్‌కు మిత్రడు… ఇక మిగిలింది బడుగు లింగయ్య యాదవ్, బండారు ప్రకాష్. వీరిద్దరూ ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అయితే టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులను పార్టీలో విలీనం చేసేందుకు బీజేపీ పావులు కదుపుతుందని సమాచారం. ఇందులో భాగంగా కేశవరావుతో మంతనాలు జరిపారని…ఆయన జంప్ అవుతారని ప్రచారం. కేకేతో పాటు డీఎస్ వెళితే…మరో ఇద్దరు ఎవరు కలిసివస్తారనేది ఇంట్రెస్టింగ్.
మొత్తానికి రాజ్యసభ సీటు రెన్యూవల్ కోసం కేకే లేఖల అస్త్రాన్ని వదిలారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇటు కేకే తాజా ప్రకటనలతో వెంటనే అలర్ట్‌యైన గులాబీ బాస్…ఆయన మరింత ముందుకు వెళ్లకముందే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్‌కు పిలిపించి ఇప్పటికే సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కేసీఆర్ బుజ్జగింపులతో కేకే మెత్తబడ్డారా? లేదా? అనేది మరో ప్రెస్ నోట్ విడుదల అయితేనే తెలుస్తుంది.