కబడ్డీ లీగ్ ఫైనల్లో ఢిల్లీ, బెంగాల్ వారియర్స్
సెమీస్ లోనే బెంగళూరు, యూ-ముంబా అవుట్ దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత కొద్దివారాలుగా కదిపికుదిపేస్తూ వచ్చిన ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ పోటీల క్లయ్ మాక్స్ కు అహ్మదాబాద్ లో రంగం సిద్ధమయ్యింది. ఢిల్లీ దబాంగ్, బెంగాల్ వారియర్స్ జట్లు సెమీఫైనల్స్ లో విజయాలు సాధించడంతో టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఢిల్లీ సూపర్ షో…. కబడ్డీలీగ్ 7వ సీజన్ లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నాకౌట్ రౌండ్ కు దూసుకొచ్చిన ఢిల్లీ దబాంగ్ జట్టు… తొలి సెమీ […]
- సెమీస్ లోనే బెంగళూరు, యూ-ముంబా అవుట్
దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత కొద్దివారాలుగా కదిపికుదిపేస్తూ వచ్చిన ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ పోటీల క్లయ్ మాక్స్ కు అహ్మదాబాద్ లో రంగం సిద్ధమయ్యింది.
ఢిల్లీ దబాంగ్, బెంగాల్ వారియర్స్ జట్లు సెమీఫైనల్స్ లో విజయాలు సాధించడంతో టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
ఢిల్లీ సూపర్ షో….
కబడ్డీలీగ్ 7వ సీజన్ లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నాకౌట్ రౌండ్ కు దూసుకొచ్చిన ఢిల్లీ దబాంగ్ జట్టు… తొలి సెమీ ఫైనల్లోనూ అదే దూకుడు కొనసాగించింది.
డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ తో ముగిసిన సమరంలో 44-38 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఆట మొదటి భాగానికే 26- 18 పాయింట్లతో పైచేయి సాధించిన ఢిల్లీ…రెండో భాగంలో సైతం అదే దూకుడు కొనసాగించింది. ఆల్ రౌండ్ గేమ్ తో ఆధిపత్యం కొనసాగించింది.
ఢిల్లీ తురుపుముక్క, సూపర్ రైడర్ నవీన్ కుమార్ అంచనాలకు తగ్గట్టుగా ఆడి తనజట్టుకు తొలిసారిగా ఫైనల్స్ లో చోటు ఖాయం చేశాడు. రైడింగ్ లో నవీన్ కుమార్ 15 పాయింట్లు సాధించగా… బ్లాకింగ్ లో అనీల్ కుమార్ 4 పాయింట్లు సంపాదించిపెట్టాడు.
యూ-ముంబాకు బెంగాల్ షాక్….
రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ యూ-ముంబాపై బెంగాల్ వారియర్స్ సంచలన విజయం సాధించడం ద్వారా మొట్ట మొదటి సారిగా లీగ్ టైటిల్ సమరానికి అర్హత సంపాదించగలిగింది.
ఆఖరి నిముషం వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో బెంగాల్ వారియర్స్ 37-35 పాయింట్ల తేడాతో యూ-ముంబాను అధిగమించింది.
శనివారం జరిగే టైటిల్ సమరంలో దబాంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండుజట్లలో ఏ జట్టు నెగ్గినా…అదిసరికొత్త విజేతను ఆవిష్కరించినట్లే అవుతుంది.