Telugu Global
NEWS

చిత్తూరు జిల్లాలో 700 కోట్లతో ఫుట్‌వేర్ సెజ్

చిత్తూరు జిల్లాలో భారీ ఫుట్‌వేర్ తయారీ యూనిట్‌ రాబోతోంది. శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు వద్ద 298 ఎకరాల్లో 700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్ సంస్థ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిసి కంపెనీ ప్రతినిధులు తమ ప్రతిపాదనను వివరించారు. 2006లో వైఎస్ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే సంస్థ తన భాగస్వామితో కలిసి నెల్లూరు జిల్లా తడ మండలం […]

చిత్తూరు జిల్లాలో 700 కోట్లతో ఫుట్‌వేర్ సెజ్
X

చిత్తూరు జిల్లాలో భారీ ఫుట్‌వేర్ తయారీ యూనిట్‌ రాబోతోంది. శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు వద్ద 298 ఎకరాల్లో 700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్ సంస్థ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిసి కంపెనీ ప్రతినిధులు తమ ప్రతిపాదనను వివరించారు.

2006లో వైఎస్ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే సంస్థ తన భాగస్వామితో కలిసి నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు వద్ద ఫుట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేసింది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ సంస్థ ఇండియాలో ఇంటెలిజెంట్‌ సెజ్ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆడిడాస్ బ్రాండ్‌ ఉత్పత్తులను ఈ సంస్థ అందిస్తోంది. ఈ సంస్థ నెల్లూరు జిల్లా మాంబట్టులో ఏర్పాటు చేసిన అపాచీ ఫుట్‌వేర్‌ సెజ్‌లో భాగస్వామిగా ఉంది.

కొత్తగా శ్రీకాళహస్తి మండలంలో ఏర్పాటు చేయబోతున్న యూనిట్‌ కోసం పదేళ్లలో 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఎకరం 6.5 లక్షలకు ఏపీఐఐసీ ద్వారా కేటాయించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది.

First Published:  17 Oct 2019 2:36 AM IST
Next Story