Telugu Global
Cinema & Entertainment

అసలు విషయం ఇది... అయినా చిరంజీవి తగ్గడం లేదు !

సైరా సినిమా వచ్చి సరిగ్గా 2 వారాలైంది. ఈ 14 రోజుల్లోనే సినిమా జాతకం ఏంటనేది తేలిపోయింది. ఓవర్సీస్ లో ఇది 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినప్పటికీ నష్టాలు తప్పలేదు. పైపెచ్చు టాప్-5 లిస్ట్ లోకి కూడా చేరలేదు. ఇక నార్త్ లో ఈ సినిమా రన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉన్నంతలో ఈ సినిమా ఆడుతోంది. అయితే నైజాంలో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయినప్పటికీ, […]

అసలు విషయం ఇది... అయినా చిరంజీవి తగ్గడం లేదు !
X

సైరా సినిమా వచ్చి సరిగ్గా 2 వారాలైంది. ఈ 14 రోజుల్లోనే సినిమా జాతకం ఏంటనేది తేలిపోయింది. ఓవర్సీస్ లో ఇది 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినప్పటికీ నష్టాలు తప్పలేదు. పైపెచ్చు టాప్-5 లిస్ట్ లోకి కూడా చేరలేదు. ఇక నార్త్ లో ఈ సినిమా రన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉన్నంతలో ఈ సినిమా ఆడుతోంది. అయితే నైజాంలో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయినప్పటికీ, ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదింకా బ్రేక్-ఈవెన్ కూడా అవ్వలేదు. అటు కర్నాటక, తమిళనాడులో కూడా సినిమా ఫ్లాప్ అయింది.

ఇలా ప్రతి ఏరియాలో సైరా జాతకం ఏంటనేది తెలిసిపోయినప్పటికీ చిరంజీవి మాత్రం ఈ సినిమా ప్రచారం ఆపలేదు. విడుదలకు ముందు ప్రమోషన్ ను లైట్ తీసుకున్న చిరంజీవి… రిలీజ్ తర్వాత మాత్రం తమదైన శైలిలో సినిమాకు ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు చిరంజీవి ఇంటికి వచ్చి అతడ్ని అభినందించి వెళ్తున్నారు. మరోవైపు చిరంజీవి స్వయంగా అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చారు. సైరా సినిమాను జగన్ చూడకపోయినా మూవీ ప్రచారానికి ఈ భేటీ బాగా పనికొచ్చింది. అంతకంటే ముందు తెలంగాణ గవర్నర్ తమిళ సైని కలిసి సినిమా చూపించారు.

ఇప్పుడు వీటికి తోడు ఏకంగా ఢిల్లీ వెళ్లారు చిరంజీవి. అవును.. ఈ పర్యటన కూడా సైరా కోసమే. ఏకంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలిసి సైరా చూడాల్సిందిగా కోరబోతున్నారు. ఈ మేరకు రామ్ మాధవ్, ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు చిరు.. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ను ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి ఆయనకు కూడా సినిమా చూపించారు. వెంకయ్యనాయుడు సినిమా చూడడం, చకచకా ఓ ట్వీట్ పడేయడం, కొన్ని ఫొటోలు రిలీజ్ చేయడం జరిగిపోయాయి.

అంతా బాగానే ఉంది కానీ సైరా రన్ దాదాపు ముగిసిపోయింది. 2 వారాల తర్వాత చేస్తున్న ఈ ప్రచారం ఆ మూవీకి ఏమాత్రం కలిసిరాదని స్వయంగా ట్రేడ్ వర్గాలే చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ ను చిరంజీవి ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిదని కూడా అంటున్నాయి.

First Published:  17 Oct 2019 2:53 PM IST
Next Story