Telugu Global
National

అంతేలే సుజనా... అప్పులు ఎగ్గొట్టి మదిలో మహాత్మ అనే స్వేచ్చ అక్కడుండదు...

టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి…. మదిలో మహాత్ముడు పేరిట ‘గాంధీ సంకల్ప యాత్ర’ను కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రారంభించారు. సుజనా ముందు నడవగా బీజేపీలో ఎప్పటి నుంచో ఉంటున్న కమలనాథులు ఆయన అడుగులో అడుగులేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుజనాచౌదరి… ప్రాంతీయ పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ప్రాంతీయ పార్టీలతో ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల వల్ల నష్టపోయిన వారిలో తానూ ఒక్కడిని అని చెప్పారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు నాటి అవసరాలు […]

అంతేలే సుజనా... అప్పులు ఎగ్గొట్టి మదిలో మహాత్మ అనే స్వేచ్చ అక్కడుండదు...
X

టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి…. మదిలో మహాత్ముడు పేరిట ‘గాంధీ సంకల్ప యాత్ర’ను కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రారంభించారు. సుజనా ముందు నడవగా బీజేపీలో ఎప్పటి నుంచో ఉంటున్న కమలనాథులు ఆయన అడుగులో అడుగులేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సుజనాచౌదరి… ప్రాంతీయ పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ప్రాంతీయ పార్టీలతో ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల వల్ల నష్టపోయిన వారిలో తానూ ఒక్కడిని అని చెప్పారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు నాటి అవసరాలు వేరని వ్యాఖ్యానించారు. 1996 నుంచి రాష్ట్రంలో రాజకీయాలు చంద్రబాబు, వైఎస్ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయాయని విమర్శించారు. చంద్రబాబు కుటుంబపాలన సాగించారని విమర్శించారు.

ప్రాంతీయ పార్టీలకు దేశంలో కాలం చెల్లిందన్నారు. గతంలో తాను ప్రాంతీయ వాదానికి మద్దతు ఇచ్చినప్పటికీ… జాతీయ వాదమే స్థిరమైనది అన్న విషయం ఇప్పుడు తనకు తెలిసి వచ్చిందన్నారు. సుజనా ఇచ్చిన సందేశం విని బీజేపీ నేతలు కూడా ముక్కున వేలేసుకున్నారు.

బ్యాంకులకు 6వేల కోట్లు ఎగొట్టి ఇప్పుడు మదిలో మహాత్ముడు అంటూ యాత్ర చేయడమే విచిత్రం అనుకుంటే… ప్రాంతీయ పార్టీల వల్ల నష్టపోయిన వారిలో తానూ ఒకడిని అని చెప్పుకోవడం కూడా విచిత్రంగా ఉందంటున్నారు.

రాజ్యసభ ఎంపీ అయింది, వేల కోట్లు సంపాదించింది, వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టింది ఆ ప్రాంతీయ పార్టీ అండతోనే కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.

బహుశా వేల కోట్లు ఎగొట్టి కూడా మదిలో మహాత్ముడు అంటూ గాంధీ తాతే షాక్ అయ్యేలా యాత్రలు చేసే అవకాశం మాత్రం ప్రాంతీయ పార్టీల్లో ఉండకపోవచ్చని… అందుకే సుజనాలో ఇప్పుడు జాతీయ భావం పొంగిపొర్లుతుండవచ్చని సెటైర్లు వేస్తున్నారు.

First Published:  16 Oct 2019 4:25 AM IST
Next Story