ప్రపంచ ఫుట్ బాల్ లో డ్రాతో గట్టెక్కిన భారత్
భారత్ పరువుదక్కించిన ఆదిల్ ఖాన్ ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియాజోన్ అర్హత పోటీలో..ఆతిథ్య భారత్ ఆఖరి నిముషం గోలుతో బంగ్లాదేశ్ ను నిలువరించి పరువుదక్కించుకొంది. కోల్ కతా లోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీ సమరంలో భారత్-బంగ్లా చెరో గోలు చేసి మ్యాచ్ ను డ్రాగా ముగించడం ద్వారా పాయింట్లు పంచుకొన్నాయి. 65వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ పోటీ 42వనిముషంలోనే బంగ్లాదేశ్ కు సాద్ ఉద్దీన్ గోలు అందించాడు.బంగ్లా 1-0తో పైచేయి సాధించడంతో.. ఈక్వలైజర్ […]
- భారత్ పరువుదక్కించిన ఆదిల్ ఖాన్
ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియాజోన్ అర్హత పోటీలో..ఆతిథ్య భారత్ ఆఖరి నిముషం గోలుతో బంగ్లాదేశ్ ను నిలువరించి పరువుదక్కించుకొంది.
కోల్ కతా లోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీ సమరంలో భారత్-బంగ్లా చెరో గోలు చేసి మ్యాచ్ ను డ్రాగా ముగించడం ద్వారా పాయింట్లు పంచుకొన్నాయి.
65వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ పోటీ 42వనిముషంలోనే బంగ్లాదేశ్ కు సాద్ ఉద్దీన్ గోలు అందించాడు.బంగ్లా 1-0తో పైచేయి సాధించడంతో.. ఈక్వలైజర్ కోసం భారత్ తుదివరకూ పోరాడవలసి వచ్చింది.
పలుసార్లు గోల్స్ సాధించే అవకాశం వచ్చినా భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే ..ఆట ముగిసే క్షణాలలో ఆదిల్ ఖాన్ హెడ్డర్ ద్వారా గోల్ చేయడంతో…భారత్ 1-1తో మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగింది.
గ్రూప్-ఇ లీగ్ ప్రారంభమ్యాచ్ లో 1-2తో ఒమాన్ చేతిలో ఓడిన భారత్…రెండోరౌండ్లో పవర్ ఫుల్ ఖతర్ ను 0-0తో నిలువరించడం ద్వారా డ్రా సాధించింది.
భారత్ ఇప్పటివరకూ ఆడిన మూడురౌండ్ల ద్వారా రెండుపాయింట్లు మాత్రమే సాధించగలిగింది.
భారత్ కంటే 83 ర్యాంకులు దిగవనున్న బంగ్లాజట్టు మెరుగైన ఆటతీరుతో 103వ ర్యాంకర్ ప్ర్తత్యర్థిజట్టును ముప్పతిప్పలు పెట్టడం విశేషం.
భారత కెప్టెన్ సునీల్ చెత్రీ, గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయారు.
భారత్, బంగ్లాదేశ్ జట్లు గత ఆరేళ్ల కాలంలో మూడుసార్లు తలపడగా ..మూడుకు మూడుమ్యాచ్ లూ డ్రాగానే ముగిశాయి.