Telugu Global
International

వీడియో కంటెంట్ రంగంలోకి 'ఫ్లిప్ కార్ట్'

దేశీయ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు వీడియో కంటెంట్ స్ట్రీమింగ్ రంగంలోనికి కూడా ప్రవేశించింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో కొత్తగా చేర్చిన ‘వీడియో’ ట్యాబ్ ద్వారా తమ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్ సేవలు అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఓవర్ ది టాప్ (ఓటీటీ) మీడియాదే పై చేయి కాబోతోందని.. దానిలో మరిన్ని అవకాశాలు ఉండబోతున్నాయనే అంచనాతో ఈ రంగంలోనికి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, […]

వీడియో కంటెంట్ రంగంలోకి ఫ్లిప్ కార్ట్
X

దేశీయ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు వీడియో కంటెంట్ స్ట్రీమింగ్ రంగంలోనికి కూడా ప్రవేశించింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో కొత్తగా చేర్చిన ‘వీడియో’ ట్యాబ్ ద్వారా తమ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్ సేవలు అందిస్తోంది.

రాబోయే రోజుల్లో ఓవర్ ది టాప్ (ఓటీటీ) మీడియాదే పై చేయి కాబోతోందని.. దానిలో మరిన్ని అవకాశాలు ఉండబోతున్నాయనే అంచనాతో ఈ రంగంలోనికి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, వూట్, ఈరోస్ నౌ, సోనీ లివ్, ఆల్ట్ బాలాజీ వంటి ఓటీటీ యాప్స్‌ను వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.

భారత్‌లో వీడియో స్ట్రీమింగ్ పరిశ్రమ ప్రతీ ఏడాది 22 శాతం వృద్ధిని సాధించడంలో పాటు 2023 నాటికి 11,977 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమగా రూపొందుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ రంగంలో తమదైన ముద్ర వేయాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది.

కేవలం సినిమాలు, ఇతర ప్రొడక్షన్ హౌస్ కంటెంట్ మాత్రమే కాకుండా ‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్’ పేరుతో కంటెంట్ రూపొందించనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ సికారియా మంగళవారం వెల్లడించారు.

మధ్య, దిగువ స్థాయి పట్టణాలే లక్ష్యంగా తమ కంటెంట్ ఉచితంగా అందిస్తామని చెబుతున్నారు. కొత్తగా ఇంటర్నెట్‌కు అలవాటు పడేవాళ్లు ఎక్కువగా వీడియో స్ట్రీమింగ్ మాధ్యమం వైపే వెళ్తున్నారని.. వారే మా టార్గెట్ అన్నారు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న 160 మిలియన్ల వినియోగదారులతో పాటు, మరో 40 మిలియన్ వినియోగదారులను ఈ వీడియో స్ట్రీమింగ్ వైపు మళ్లిస్తామని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ వీడియో కంటెంట్ క్రియేటర్‌గా ఆస్కార్ విజేత గునీత్ మొంగా వ్యవహరిస్తారని.. రాబోయే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ స్టుడియో.. నెక్ట్స్, సిఖ్యా ప్రొడక్షన్లతో జతకట్టి కొత్త కంటెంట్ తీసుకొని వస్తామని చెప్పారు.

ఇక వచ్చే నెల నుంచి ఫరాఖాన్ నిర్వహించే ‘బ్యాక్ బెంచర్స్’ వెబ్ సిరీస్ ప్రారంభమవుతుందని ప్రకాశ్ తెలిపారు.

First Published:  16 Oct 2019 1:28 AM IST
Next Story