25వేల మంది హోంగార్డులను తొలగించిన యోగి ఆదిత్యనాథ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హోంగార్డుల జీతాలు ఇటీవల పెరగగా… ఉత్తరప్రదేశ్ హోంగార్డులు మాత్రం రోడ్డున పడ్డారు. ఒకేరోజు 25వేల మంది హోంగార్డులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. 25వేల మంది హోంగార్డులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 99 వేల మంది హోంగార్డులకు మరో దారిలో షాక్ ఇచ్చింది. వారికి ఇకపై రోజువారీ వేతనం దక్కకుండా చేసింది. 99వేల మంది హోంగార్డుల పని దినాలను 25 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది. కాబట్టి 99 […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హోంగార్డుల జీతాలు ఇటీవల పెరగగా… ఉత్తరప్రదేశ్ హోంగార్డులు మాత్రం రోడ్డున పడ్డారు. ఒకేరోజు 25వేల మంది హోంగార్డులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.
25వేల మంది హోంగార్డులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 99 వేల మంది హోంగార్డులకు మరో దారిలో షాక్ ఇచ్చింది. వారికి ఇకపై రోజువారీ వేతనం దక్కకుండా చేసింది. 99వేల మంది హోంగార్డుల పని దినాలను 25 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది. కాబట్టి 99 వేల మందికి కేవలం 15 రోజులకు మాత్రమే వేతనం దక్కుతుంది.
ఆర్థిక ఒత్తిడి కారణంగానే 25వేల మందిని తొలగించడంతో పాటు 99 వేల మంది పని దినాల్లోనూ కోత పెట్టినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
యూపీలో హోంగార్డులను ఎక్కువగా ట్రాఫిక్ నియంత్రణకు వాడేవారు. ఇప్పుడు 25 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు 99 వేల మంది హోంగార్డుల పని దినాలపైనా కోత పెట్టిన నేపథ్యంలో చాలా సమస్యలు వస్తాయని భావిస్తున్నారు.
ఒకవైపు తెలంగాణలో బీజేపీ నేతలు ఆర్టీసీ సమ్మెను ముందుండి నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికుల సమస్యను పరిష్కరించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఇంతలో బీజేపీ సీఎం యోగి ఒకే రోజు 25 వేల మంది హోంగార్డులను రోడ్డున పడేయడం, మరో 99వేల మంది హోంగార్డులకు కేవలం 15 రోజులకే వేతనం చెల్లిస్తామని ప్రకటించడం తెలంగాణ బీజేపీ నేతలకు ఇబ్బందే.