సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి " హైకోర్టు
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపైనా, ప్రభుత్వంపైనా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తక్షణం సమ్మె విరమించాల్సిందిగా హైకోర్టు సూచించింది. ఈ సందర్భంగా అటు ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్రభుత్వానికి ముందు చూపు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆదేశించింది. కార్మికులు తక్షణం సమ్మె విరమించి విధుల్లో పాల్గొనాలని ఆదేశించింది. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావన్న కార్మిక సంఘాల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. పండుగ పూట సమ్మె చేయడం […]
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపైనా, ప్రభుత్వంపైనా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తక్షణం సమ్మె విరమించాల్సిందిగా హైకోర్టు సూచించింది. ఈ సందర్భంగా అటు ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్రభుత్వానికి ముందు చూపు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆదేశించింది. కార్మికులు తక్షణం సమ్మె విరమించి విధుల్లో పాల్గొనాలని ఆదేశించింది. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావన్న కార్మిక సంఘాల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. పండుగ పూట సమ్మె చేయడం సమంజసమేనా అని ప్రశ్నించింది. ప్రభుత్వం ఒకవేళ ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ఆర్టీసీ సంఘాలను హైకోర్టు ప్రశ్నించింది.
సమ్మె కేవలం ప్రభుత్వానికి, కార్మికులకు సంబంధించిన వ్యవహారం కాదని.. ఇది ఇప్పుడు ప్రజాసమస్యగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల డిమాండ్లు న్యాయబద్దమైనవే కావొచ్చు అని… కానీ పండుగ వేళ రవాణా వ్యవస్థను నిలిపేస్తే దాని ప్రభావం ప్రజలపై ఎలా ఉంటుందో ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించింది. కార్మికులపై ప్రభుత్వం ఎస్మా ఎందుకు ప్రయోగించకూడదని చెప్పాలని కార్మిక సంఘాలను నిలదీసింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని… అలా చేస్తే మిగిలిన కార్పొరేషన్ల నుంచి కూడా అదే డిమాండ్ వస్తుందని ప్రభుత్వం వాదించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్పగా… అలా చేసి ఉంటే విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
సుమారు నాలుగు వేల బస్సులు కూడా నడవడం లేదని… దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికులు సమ్మె విరమించాలని… వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని హైకోర్టు సూచించింది. తమ సూచనలను ఎంత వరకు అమలు చేసింది…. ఈనెల 18న కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.