ఉత్తమ్‌తో విభేదాలు.... హుజూర్‌నగర్ కు విజయశాంతి వెళతారా?
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక క్లైమాక్స్‌కు చేరింది. మరో ఆరు రోజులు మాత్రమే ప్రచారానికి టైమ్ ఉంది. శనివారంతో ప్రచారం గడువు ముగుస్తోంది. 21న పోలింగ్. అయితే ఈలోపు కాంగ్రెస్ తరపున ఎవరెవరు ప్రచారం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారానికి వస్తారని అభ్యర్థి పద్మావతిరెడ్డి చెబుతున్నారు. కానీ ఏఏ నేతలు హుజూర్‌నగర్ బాట పడతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఉత్తమ్‌కు ఇప్పటికే సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రచారంలో […]
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక క్లైమాక్స్‌కు చేరింది. మరో ఆరు రోజులు మాత్రమే ప్రచారానికి టైమ్ ఉంది. శనివారంతో ప్రచారం గడువు ముగుస్తోంది. 21న పోలింగ్. అయితే ఈలోపు కాంగ్రెస్ తరపున ఎవరెవరు ప్రచారం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారానికి వస్తారని అభ్యర్థి పద్మావతిరెడ్డి చెబుతున్నారు. కానీ ఏఏ నేతలు హుజూర్‌నగర్ బాట పడతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఉత్తమ్‌కు ఇప్పటికే సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం హుజూర్‌నగర్ వైపు వెళతారా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా వెళతారా? లేదా? అనేది పెద్ద డౌట్.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అక్కడక్కడా మెరిసిన విజయశాంతి ఆ తరువాత మళ్లీ స్లో డౌన్ అయ్యారు. కాంగ్రెస్‌లో ఎక్కడా కనిపించడం లేదు. ఇంటర్మీడియట్ బోర్డు ఆందోళన ధర్నాలో పాల్గొన్నారు. హల్‌చల్ చేశారు. ఆ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే మాత్రం ప్రెస్‌నోట్లు పంపుతున్నారు. టీవీ చానళ్లలో స్క్రోలింగ్‌కే పరిమితమవుతున్నారు. కానీ పొలిటికల్ స్క్రీన్‌పైకి రావడం లేదు. అయితే హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక ప్రచారానికి రాములమ్మ వస్తారా? లేదా? అనేది ఇంపార్టెంట్ పాయింట్‌గా మారింది.
కొంతకాలంగా పార్టీ కి దూరంగా ఉంటున్న విజయ శాంతి బీజేపీ లో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఆమెను సంప్రదించారు. పార్టీ మారేది లేదని ఆమె ప్రకటన కూడా చేశారు. కానీ ఆమె ఇంకా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారనేది గాంధీభవన్ వర్గాల అనుమానం. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ఆమె రాకపోవచ్చు అనేది వీరి డౌట్.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తమ్‌తో కూడా విజయ శాంతికి విభేదాలు వచ్చాయి. తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం , రాహుల్ గాంధీ టూర్లలో పేరు చేర్చకపోవడంపై అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఇప్పుడు మర్చిపోయి హుజూర్‌నగర్‌లో ప్రచారానికి విజయశాంతి వస్తారా? అనే అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో ఉన్నాయి.
చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి మేకప్ వేసుకున్నారు. మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవరు సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సాకుగా చూపించి ప్రచారానికి రాకపోవచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.