Telugu Global
NEWS

హోంగార్డులకు జీతాలు పెంచిన జగన్ సర్కార్

ఏపీ ప్రభుత్వం హోంగార్డులకు తీపి కబురు చెప్పింది. వారి జీతాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంగార్డులకు రోజుకు రూ. 600 చొప్పున చెల్లిస్తున్నారు. దాన్ని 710 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోంగార్డుల నెల జీతం 18వేల నుంచి 21,300కు పెరగనుంది. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతానని జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. పెంచిన జీతాలు ఈనెల 1 నుంచే అమలులోకి వస్తాయి. రాష్ట్రంలో […]

హోంగార్డులకు జీతాలు పెంచిన జగన్ సర్కార్
X

ఏపీ ప్రభుత్వం హోంగార్డులకు తీపి కబురు చెప్పింది. వారి జీతాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంగార్డులకు రోజుకు రూ. 600 చొప్పున చెల్లిస్తున్నారు. దాన్ని 710 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోంగార్డుల నెల జీతం 18వేల నుంచి 21,300కు పెరగనుంది.

అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతానని జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. పెంచిన జీతాలు ఈనెల 1 నుంచే అమలులోకి వస్తాయి. రాష్ట్రంలో 16వేల 616 మంది హోంగార్డులకు ఈ నిర్ణయం వల్ల మంచి జరుగుతుంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సీఎం జగన్‌కు ఏపీ హోంగార్డుల సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

First Published:  13 Oct 2019 12:15 AM IST
Next Story