ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో మంజురాణి
సెమీస్ లో థాయ్ బాక్సర్ పై విజయం జమునా, లవ్ లీన్, మేరీ కోమ్ లకు కాంస్యాలు 2019 మహిళా ప్రపంచ బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్స్ చేరిన ఏకైక భారత బాక్సర్ గా నిలిచింది. మేరీ కోమ్, జమునా బోరో తమతమ విభాగాలలో కాంస్యపతకాలతో సరిపెట్టుకోడంతో…దేశానికి బంగారు పతకం అందించే బాధ్యత మంజు రాణిపైన పడింది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ 48 కిలోల విభాగం సెమీఫైనల్లో 6వ సీడ్ మంజురాణి […]
- సెమీస్ లో థాయ్ బాక్సర్ పై విజయం
- జమునా, లవ్ లీన్, మేరీ కోమ్ లకు కాంస్యాలు
2019 మహిళా ప్రపంచ బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్స్ చేరిన ఏకైక భారత బాక్సర్ గా నిలిచింది. మేరీ కోమ్, జమునా బోరో తమతమ విభాగాలలో కాంస్యపతకాలతో సరిపెట్టుకోడంతో…దేశానికి బంగారు పతకం అందించే బాధ్యత మంజు రాణిపైన పడింది.
రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ 48 కిలోల విభాగం సెమీఫైనల్లో 6వ సీడ్ మంజురాణి 4-1 పాయింట్లతో థాయ్ లాండ్ బాక్సర్ చుతామత్ రుకాసత్ ను అధిగమించి తొలి ప్రయత్నంలోనే ఫైనల్స్ లో చోటు సంపాదించింది.
బంగారు పతకం కోసం జరిగే టైటిల్ సమరంలో…రష్యాకు చెందిన 2వ సీడ్ ఎకతెరీనా ప్లాటిసేవ్ తో మంజు రాణి తలపడనుంది.
మహిళల 69 కిలోల విభాగం సెమీస్ లో లవ్ లీనా బోర్గెయిన్, 51 కిలోల సెమీస్ లో మేరీ కోమ్, 54 కిలోల విభాగం సెమీస్ లో జమునా బోరో పరాజయాలు పొందడంతో కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
48 కిలోల ఫైనల్లో మంజురాణి విజేతగా నిలిస్తే బంగారు పతకం అందుకొంటుంది. ఒక వేళ ఓడితే రజత పతకంతో స్వదేశానికి తిరిగిరానుంది.
మొత్తం మీద 2019 మహిళా ప్రపంచ బాక్సింగ్ లో భారత బాక్సర్లు నాలుగు పతకాలు ఖాయం చేయడం దేశానికే గర్వకారణంగా మిగిలిపోతుంది.