ఎస్వీబీసీ చైర్మన్‌ను నవ్వులపాలు చేసిన ఇంటి దొంగలు
శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్, నటుడు పృథ్వీరాజ్‌ను నవ్వులపాలు చేసేందుకు ఎస్వీబీసీలో పనిచేస్తున్న కొందరు ప్రయత్నించడం వివాదంగా మారింది. పృథ్వీకి సంబంధించి ఎడిటింగ్ పూర్తికాని వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరణిలో స్నానం చేయడానికి సంబంధించిన సందేశంతో కూడిన వీడియోను ఒకటి రికార్డు చేశారు. ఇందులో పృథ్వీ స్వయంగా కనిపించారు. ఈ ప్రోమోను తెలుగు, తమిళం, కన్నడ భాషాల్లో రికార్డు చేశారు. తమిళంలో డైలాగులు చెబుతున్న సమయంలో పృథ్వీ ఉచ్ఛారణలో పొరపాట్లు […]
శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్, నటుడు పృథ్వీరాజ్‌ను నవ్వులపాలు చేసేందుకు ఎస్వీబీసీలో పనిచేస్తున్న కొందరు ప్రయత్నించడం వివాదంగా మారింది. పృథ్వీకి సంబంధించి ఎడిటింగ్ పూర్తికాని వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరణిలో స్నానం చేయడానికి సంబంధించిన సందేశంతో కూడిన వీడియోను ఒకటి రికార్డు చేశారు. ఇందులో పృథ్వీ స్వయంగా కనిపించారు. ఈ ప్రోమోను తెలుగు, తమిళం, కన్నడ భాషాల్లో రికార్డు చేశారు.
తమిళంలో డైలాగులు చెబుతున్న సమయంలో పృథ్వీ ఉచ్ఛారణలో పొరపాట్లు దొర్లాయి. ఎడిటింగ్‌లో వాటిని తీసివేయవచ్చన్న ఉద్దేశంతో ఓఎఫ్‌సీ ద్వారా ఆ వీడియోను స్టూడియోకు పంపారు. కానీ పృథ్వీ తప్పుగా ఉచ్ఛారణ చేసిన వీడియోను కొందరు సిబ్బంది సోషల్ మీడియాలోకి లీక్ చేశారు.
అలా చేయడం ద్వారా ఎస్వీబీసీ చైర్మన్‌ను నవ్వుల పాలు చేశారు. ఈ అంశాన్ని పృథ్వీ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వీడియోను లీక్ చేసిన వారిని గుర్తించాల్సిందిగా టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రస్తుతం పృథ్వీ విదేశాల్లో ఉన్నారు.