రాంమాధవ్ ఎక్కడ?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కు చెక్‌పెట్టే ప్రయత్నం జరుగుతుందా? జాతీయస్థాయిలో బీజేపీలో గ్రూపు రాజకీయాలు ముదిరాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీలో రాంమాధవ్‌కు చెక్ పెట్టేందుకు కీలక నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనల బృందంలో రాంమాధవ్ కీలక సభ్యుడు. మోదీ ఫారిన్ టూర్లలో రాంమాధవ్ తప్పనిసరిగా ఉండేవారు. కానీ ఇటీవల అమెరికా పర్యటనలో రాంమాధవ్ కనిపించలేదు. అదే సమయంలో ఆయన బెంగళూరులో ఉన్నారు, 370 రద్దుపై తమ […]
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కు చెక్‌పెట్టే ప్రయత్నం జరుగుతుందా? జాతీయస్థాయిలో బీజేపీలో గ్రూపు రాజకీయాలు ముదిరాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీలో రాంమాధవ్‌కు చెక్ పెట్టేందుకు కీలక నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనల బృందంలో రాంమాధవ్ కీలక సభ్యుడు. మోదీ ఫారిన్ టూర్లలో రాంమాధవ్ తప్పనిసరిగా ఉండేవారు. కానీ ఇటీవల అమెరికా పర్యటనలో రాంమాధవ్ కనిపించలేదు. అదే సమయంలో ఆయన బెంగళూరులో ఉన్నారు, 370 రద్దుపై తమ పార్టీ స్డాండ్‌ను వివరించే మీటింగ్‌లో పాల్గొన్నారు.
బీజేపీ విదేశీ మిషన్ టీమ్‌లో రాంమాదవ్ ఓ మెంబర్. పొరుగుదేశాలతో సంబంధాలు, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల సబ్జెక్ట్‌లను రాంమాధవ్ చూసేవారు. అయితే కొంతకాలంగా ఈ టాపిక్‌లతో…. పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోతోంది. ఇటీవల చైనాకు వెళ్లిన 11 మంది ప్రతినిధి బృందంలో లేకుండా పోయారు. తాను ఇంతకుముందు చూసిన జమ్మూకాశ్మీర్ వ్యవహారాల నుంచి కూడా ఆయనను పక్కనపెట్టారు.
రాంమాధవ్ పార్టీలో ఎదుగుతున్నారు. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు వ్యతిరేకవర్గం పనిచేస్తుందని సమాచారం. ప్రధానకార్యదర్శలు భూపేంద్రయాదవ్, అనిల్ జైన్‌లు రాంమాధవ్ ప్లేస్‌కు ఎర్త్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. అమిత్‌షా గురించి తెలిసిన బీజేపీ నేత లు మాత్రం….రాంమాధవ్ మీడియా ప్రెండ్లీ…. అంతేకాదు.. ఇటీవల బాగా ఫోకస్ అవుతున్నారు. దీంతో ఆయన వ్యతిరేకవర్గం ఆయన ఎదుగుతున్న తీరును జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
మరోవైపు జీవిఎల్ ప్లేస్‌లో రాంమాధవ్ రాజ్యసభకు వెళ్లాల్సి ఉండేదట. కానీ మోదీకి చెప్పి…రాంమాధవ్‌కు సీటు రాకుండా చేశారని ఢిల్లీ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లోనే మంత్రి పదవి దక్కుతుందని మరో మాట విన్పిస్తోంది. అయితే ఆ పదవి కూడా ఆయనకు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి. మొత్తానికి రాంమాధవ్‌కు చెక్ పెట్టే కార్యక్రమం మాత్రం ఉధృతంగా సాగుతోందని అంటున్నారు.