మళ్లీ యూ-టర్నా? కంగుతింటున్న టీడీపీ శ్రేణులు
చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి అనేక రాజకీయ ఎత్తులు వేస్తూ వచ్చారు. ఐదేళ్లకొకసారి పొత్తుల భాగస్వామిని మారుస్తూ వచ్చారు. అప్పట్లో ఏకపక్ష మీడియా ఉండడం, సోషల్ మీడియా లేకపోవడంతో అదంతా చంద్రబాబు చాణక్యనీతిగా ప్రసిద్దికెక్కింది. కానీ ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారాయి. అప్పట్లో చేసిన పనులను చంద్రబాబు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ జనం ఆ పనులను, విధానాలను స్కాన్ చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి క్షణాల్లో చంద్రబాబు నిర్ణయాలను రోడ్డు మీద పడేస్తున్నారు. ఆధునిక […]
చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి అనేక రాజకీయ ఎత్తులు వేస్తూ వచ్చారు. ఐదేళ్లకొకసారి పొత్తుల భాగస్వామిని మారుస్తూ వచ్చారు. అప్పట్లో ఏకపక్ష మీడియా ఉండడం, సోషల్ మీడియా లేకపోవడంతో అదంతా చంద్రబాబు చాణక్యనీతిగా ప్రసిద్దికెక్కింది.
కానీ ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారాయి. అప్పట్లో చేసిన పనులను చంద్రబాబు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ జనం ఆ పనులను, విధానాలను స్కాన్ చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి క్షణాల్లో చంద్రబాబు నిర్ణయాలను రోడ్డు మీద పడేస్తున్నారు.
ఆధునిక కాలంలోనూ చంద్రబాబు పదేపదే పొత్తు భాగస్వామ్యులను మార్చడం ఆయనపై గౌరవం తగ్గడానికి కారణమైంది. ఏ ఒక్క మాట మీద నిలబడకుండా మొహమాటం లేకుండా జారుకుంటున్న విధానం వల్లే ఆయనకు నెటిజన్లు యూ- టర్న్ అంకుల్, యూ- టర్న్ బాబాయ్, యూ- టర్న్ బాబు అంటూ బిరుదులు కూడా ఇచ్చేశారు.
40 ఏళ్ల ఇండస్ట్రీ, దేశంలోనే మోస్ట్ సీనియర్ అని చంద్రబాబును అభిమానించేవారు చెప్పుకోగలుగుతున్నారే గానీ… ఆయన వ్యక్తిత్వాన్ని చూసి గర్వించలేని పరిస్థితి. గొప్పలీడర్ అని చెప్పుకుంటున్నా యూ- టర్న్‌లు, పొత్తులు లేకుండా పార్టీని నడపలేని పరిస్థితి. ఈ విషయంలో టీడీపీ కేడర్ కూడా బాగా చికాకు పడుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన, టీఆర్‌ఎస్, బీజేపీ, ఆప్… ఇలా అన్ని పార్టీలను వాడి వదిలేశారు బాబు. బీజేపీని, కమ్యూనిస్టులను పలుమార్లు వాడేసి వారిని ఒకశాతం కంటే తక్కువ ఓట్ల శాతానికి పడేశారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌తో కలిసి తిరిగి ఇప్పుడు హఠాత్తుగా తిరిగి బీజేపీ రాగం అందుకోవడం చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలే ”చీ… జీవితం” అంటూ విసుక్కుంటున్నారు.
అసలు టీడీపీ పోరాట యోధురాలో, లేక అవకాశవాదో, సమయానుకులంగా సర్దుకుపోయే పార్టీనో, కండ ఉన్న వారితో కలిసి వెళ్లే పార్టీనో అర్థం కావడం లేదని ఒక సీనియర్ నేత విసుక్కున్నారు.
చంద్రబాబు తాజా యూ- టర్న్ వల్ల ఆయనకు, ఆయన ఆర్థిక వ్యవహారాలకు రక్షణ దొరకవచ్చు గానీ… పార్టీ గౌరవానికి మాత్రం విఘాతమేనని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మా లీడర్ అని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయిందన్నారు.
‘బీజేపీతో విభేదించి తప్పుచేశాం’ అంటూ చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు విన్న తర్వాత పార్టీ అధినేత నిర్ణయ సామర్థ్యం పైనా కేడర్‌లో అనుమానాలు బయలుదేరాయని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఒక మీడియా సంస్థ వద్ద వ్యాఖ్యానించారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి యూ- టర్న్‌లు తీసుకోకుండా నిలబడడం వల్లే మొన్న ఎన్నికల్లో ప్రజలు ఆయన వెంట నిలిచారని విశ్లేషించారు. కానీ చంద్రబాబు పదేపదే యూ- టర్న్‌లతో అవకాశవాద రాజకీయాలకు తెగబడ్డారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు.