చంద్రబాబు యూ- టర్న్‌పై బీజేపీ ఫైర్
మోడీతో తనకు వ్యక్తిగత వైరం లేదని, కేంద్ర ప్రభుత్వంతో వివాదం కారణంగా టీడీపీ నష్టపోయిందంటూ చంద్రబాబు చేసిన యూ- టర్న్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ పైర్ అయ్యారు. అవినీతిపరుడైన చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును తాము నమ్మే ప్రసక్తే లేదన్నారు. ఏపీలో టీడీపీ నుంచి ఇటీవల బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయని వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని […]
మోడీతో తనకు వ్యక్తిగత వైరం లేదని, కేంద్ర ప్రభుత్వంతో వివాదం కారణంగా టీడీపీ నష్టపోయిందంటూ చంద్రబాబు చేసిన యూ- టర్న్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ పైర్ అయ్యారు. అవినీతిపరుడైన చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును తాము నమ్మే ప్రసక్తే లేదన్నారు.
ఏపీలో టీడీపీ నుంచి ఇటీవల బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయని వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని టీడీపీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారని… అలా నమ్మించడం ద్వారా టీడీపీ నేతలు బీజేపీలో చేరకుండా అడ్డుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశమన్నారు.
చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వబోమని… చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసేశామన్నారు. ఈ విషయాన్ని గతంలోనే అమిత్ షా కూడా చెప్పారని గుర్తు చేశారు. భవిష్యత్తులో టీడీపీతో ఎలాంటి పొత్తులు ఉండబోవన్నారు.