ప్రమాదం అంచున ఆర్థిక వ్యవస్థ " రఘురామ్ రాజన్... మందగమనం లేదు. 3 సినిమాల కలెక్షన్లే నిదర్శనం " కేంద్ర మంత్రి
భారత ఆర్థిక పరిస్థితిపై రెండు కీలక ప్రకటనలు ఇద్దరు పెద్దల నుంచి వెలువడ్డాయి. భారత ఆర్ధిక వ్యవస్థ పనితీరుపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యలోటు ప్రమాదకర స్థాయికి చేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తన నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 2016లో వృద్ధి రేటు 9 శాతం ఉండగా ఇప్పుడది పడుతూ వచ్చి 5 శాతానికి దిగజారిందన్నారు. ప్రస్తుతం దేశంలో పెట్టుబడులుగానీ, ఎగుమతులు గానీ, వినియోగం గానీ ఆశించిన […]
భారత ఆర్థిక పరిస్థితిపై రెండు కీలక ప్రకటనలు ఇద్దరు పెద్దల నుంచి వెలువడ్డాయి. భారత ఆర్ధిక వ్యవస్థ పనితీరుపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యలోటు ప్రమాదకర స్థాయికి చేరిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తన నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 2016లో వృద్ధి రేటు 9 శాతం ఉండగా ఇప్పుడది పడుతూ వచ్చి 5 శాతానికి దిగజారిందన్నారు. ప్రస్తుతం దేశంలో పెట్టుబడులుగానీ, ఎగుమతులు గానీ, వినియోగం గానీ ఆశించిన స్థాయిలో లేవన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో రాజకీయ జోక్యం మితిమీరడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ల పరిస్థితిలోకి వెళ్లిపోయిందన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు అంటూ కొందరు విదేశీ పోటీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. అభివృద్ది వల్ల సంస్కృతి, సంప్రదాయాలకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు.
అయితే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాత్రం దేశంలో ఆర్ధిక మందగమనం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇటీవల మూడు సినిమాలు విడుదలవగా అవి ఇప్పటి వరకు 120 కోట్లు వసూలు చేశాయని…. దీన్ని బట్టి ఎక్కడ మందగమనం ఉందని ప్రశ్నించారు. సినిమాలపై తనకు పూర్తి అవగాహన ఉందని… సినిమాల వల్ల మంచి వ్యాపారం జరుగుతుందన్నారు.