Telugu Global
National

జెన్‌కోలో రివర్స్ టెండరింగ్... రూ. 164 కోట్లు ఆదా

కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం భారీగా ప్రజాధనాన్ని ఆదా చేస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో 782 కోట్లు ఆదా కాగా… ఏపీ జెన్‌కోలోనూ రివర్స్ విధానం వందల కోట్లు మిగిలిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌కు ఒడిషాలోని మహానది బొగ్గు క్షేత్రం నుంచి బొగ్గు రవాణాకు టెండర్ పిలిచారు. ఏడు కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. ఏటా 36 లక్షల మెట్రిక్ టన్నులు బొగ్గు రవాణా కోసం బిడ్లు ఆహ్వానించారు. ముంబైకి చెందిన ఎంబీజీ […]

జెన్‌కోలో రివర్స్ టెండరింగ్... రూ. 164 కోట్లు ఆదా
X

కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం భారీగా ప్రజాధనాన్ని ఆదా చేస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో 782 కోట్లు ఆదా కాగా… ఏపీ జెన్‌కోలోనూ రివర్స్ విధానం వందల కోట్లు మిగిలిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌కు ఒడిషాలోని మహానది బొగ్గు క్షేత్రం నుంచి బొగ్గు రవాణాకు టెండర్ పిలిచారు. ఏడు కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. ఏటా 36 లక్షల మెట్రిక్ టన్నులు బొగ్గు రవాణా కోసం బిడ్లు ఆహ్వానించారు.

ముంబైకి చెందిన ఎంబీజీ కమొడిటీస్ కంపెనీ టన్నుకు రూ. 1370లతో బొగ్గు రవాణాకు కోట్ చేసి ఎల్‌-1గా నిలిచింది. అనంతరం అధికారులు ఎల్‌-1 ధర ఆదారంగా రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దాంతో చెన్నైకు చెందిన చిట్టినాడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ మెట్రిక్ టన్ను బొగ్గును రూ. 1146కు రవాణా చేసేందుకు ముందుకొచ్చి కాంట్రాక్టును దక్కించుకుంది.

గత ప్రభుత్వం మెట్రిక్ టన్ను బొగ్గు రవాణాకు రూ. 1240 చెల్లించేది. కానీ కొత్త ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌లో ఆ ధరను రూ. 1146కు తీసుకొచ్చింది. అంటే మెట్రిక్ టన్నుపై దాదాపు 100 రూపాయలు తగ్గింది. ఏటా కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌కు 36లక్షల 75వేల మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా అవుతుంది. దీన్ని బట్టి చూస్తే బొగ్గు రవాణాలో ఏటా 82. 32 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. రెండేళ్లకు గాను 164. 64 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా కానుంది.

ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా బొగ్గు రవాణా టెండర్లను పూర్తి చేయడం జెన్‌కో చరిత్రలో ఇదే తొలిసారి అని జెన్‌కో ఎండి శ్రీధర్ చెప్పారు. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా చూడగలిగామని… రివర్స్ టెండరింగ్‌లో భారీగా డబ్బు ఆదా అవడం సంతోషంగా ఉందన్నారు. జెన్‌కో ఆత్మస్ధైర్యం పెరిగిందన్నారు.

First Published:  12 Oct 2019 3:45 AM IST
Next Story