Telugu Global
National

పెద్దల సిఫార్సు లేకుండానే శ్రీవారి బ్రేక్ దర్శన భాగ్యం

తిరుమలలో సంస్కరణల పర్వం కొనసాగుతోంది. త్వరలోనే మరో పథకాన్ని టీటీడీ తీసుకురాబోతోంది. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేల విరాళం ఇస్తే ఒక బ్రేక్ దర్శనం టికెట్‌ను ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా చర్చలు పూర్తి చేసిన టీటీడీ… అందుకు తగ్గట్టు సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసే పనిలో ఉంది. మరో నాలుగు వారాల్లో ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పటి వరకు కేవలం పెద్దపెద్ద వాళ్లకు, వారి సిఫార్సు ఉన్న వారికి మాత్రమే బ్రేక్‌ దర్శన భాగ్యం దక్కుతోంది. ఇకపై […]

పెద్దల సిఫార్సు లేకుండానే శ్రీవారి బ్రేక్ దర్శన భాగ్యం
X

తిరుమలలో సంస్కరణల పర్వం కొనసాగుతోంది. త్వరలోనే మరో పథకాన్ని టీటీడీ తీసుకురాబోతోంది. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేల విరాళం ఇస్తే ఒక బ్రేక్ దర్శనం టికెట్‌ను ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా చర్చలు పూర్తి చేసిన టీటీడీ… అందుకు తగ్గట్టు సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసే పనిలో ఉంది. మరో నాలుగు వారాల్లో ఈ విధానం అమలులోకి రానుంది.

ఇప్పటి వరకు కేవలం పెద్దపెద్ద వాళ్లకు, వారి సిఫార్సు ఉన్న వారికి మాత్రమే బ్రేక్‌ దర్శన భాగ్యం దక్కుతోంది. ఇకపై శ్రీవాణి ట్రస్ట్‌కు 10వేలు చెల్లించడం ద్వారా ఒకబ్రేక్ దర్శనం టికెట్ పొందవచ్చు. ఫ్యామిలీ మొత్తం బ్రేక్‌ దర్శనానికి వెళ్లాలనుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి 10వేల చొప్పున విరాళం ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ విధానం వల్ల ఎగువ మధ్యతరగతి భక్తులకు శ్రీవారిని బ్రేక్‌ దర్శనంలో దర్శించుకునే అవకాశం దక్కుతుంది. ఇలా విరాళం ఇవ్వడం ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్‌ తీసుకున్న వారి కోసం ప్రత్యేక క్యూ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు పూర్తి కాగానే వీరిని శ్రీవారి దర్శనానికి పంపిస్తారు. వీరికి కావాల్సిన వసతి గదిని అద్దెకు టీటీడీ సమకూరుస్తుంది.

మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు ఏర్పాటైన శ్రీవాణి ట్రస్ట్‌కు ఈ విధానం ద్వారా భారీగా నిధులు కూడా సమకూరే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల భక్తులు బ్రేక్ దర్శనం టికెట్ల కోసం పెద్దల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.

మరోవైపు… తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో పెద్ద లడ్డూలు, వడలను కూడా సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు టీడీపీ సిద్దమవుతోంది. ఇప్పటి వరకు పెద్దలడ్డూలు, వడలు కేవలం సిఫార్సు లేఖలున్న వారికి మాత్రమే ఇచ్చేవారు. వాటిని కూడా ఆలయం లోపల వగపడి వద్దే తీసుకోవాల్సి ఉండేది.

ఇకపై ఈ పెద్ద లడ్డూలను, వడలను కూడా లడ్డూ కౌంటర్‌లో అందించనున్నారు. సామాన్యులకు ఇప్పటి వరకు చిన్న లడ్డూలను మాత్రమే ఇచ్చారు. ఇకపై పెద్ద లడ్డూల తయారీ సంఖ్యను పెంచి వాటిని కూడా సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

First Published:  11 Oct 2019 5:42 AM IST
Next Story