Telugu Global
NEWS

ఒక్క రోజూ ఓవర్‌ డ్రాఫ్ట్ కు వెళ్లకుండా నడిపాం.... అది మా సత్తా

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థకు మేజర్ డ్యామేజ్ చేసి వెళ్లారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. కొత్త ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బుగ్గన ప్రస్తుత పరిస్థితి వివరించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదని అప్పుడే ఆర్థిక వ్యవస్థను తామేదో చేసినట్టు చంద్రబాబు విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వం మారే సమయంలో గరిష్టంగా 5వేల […]

ఒక్క రోజూ ఓవర్‌ డ్రాఫ్ట్ కు వెళ్లకుండా నడిపాం.... అది మా సత్తా
X

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థకు మేజర్ డ్యామేజ్ చేసి వెళ్లారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. కొత్త ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బుగ్గన ప్రస్తుత పరిస్థితి వివరించారు.

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదని అప్పుడే ఆర్థిక వ్యవస్థను తామేదో చేసినట్టు చంద్రబాబు విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వం మారే సమయంలో గరిష్టంగా 5వేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉంటాయని.. కానీ చరిత్రలో తొలిసారిగా చంద్రబాబు దిగిపోయే సమయానికి 40వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు కొత్త ప్రభుత్వంపై వేసి వెళ్లారని బుగ్గన వివరించారు.

ఎన్నికలు సమీపించగానే చంద్రబాబు ఇష్టానుసారం అప్పులు తెచ్చి పసుపు- కుంకుమ లాంటి పథకాలకు, తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు వాడారని చెప్పారు. స్కాలర్‌ షిప్‌లు, మిడ్ డే మీల్స్ బిల్లులు, డైట్ చార్జీలు, ఆస్పత్రుల్లో మందులకు సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించకుండా వెళ్లిపోయారన్నారు. అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వకుండా నిధులను ఇతర అవసరాలకు వాడేశారని బుగ్గన వివరించారు.

ఆర్థిక క్రమ శిక్షణ గురించి చంద్రబాబు, యనమల మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఏడాది ఏకంగా 42 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారని బుగ్గన వివరించారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నెలలో 8రోజులు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లామని… ఆ తర్వాత ఒక్క రోజు కూడా కొత్త ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లలేదని వివరించారు. అది తమ ఆర్థిక క్రమశిక్షణ అని బుగ్గన చెప్పారు.

అక్టోబర్ 7న వెయ్యి కోట్ల రూపాయల అప్పు కోసం వెళ్తే ఆర్‌బీఐ వద్ద 2500 కోట్లకు అంగీకారం వచ్చిందని… దీన్ని బట్టి కొత్త ప్రభుత్వ విధానాలపై ఆర్ధిక సంస్థలు ఎంత నమ్మకంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు.

పవర్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్‌బీఐ వద్దకు అప్పు కోసం వెళ్తే వారేదో అనుమానం వ్యక్తం చేశారని… అసత్య ప్రచారం చేస్తున్నారని బుగ్గన వివరించారు. 2017లో ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీస్‌ మొత్తం 9600 కోట్లు ఉండగా… అది 2018 నాటికి 35వేల కోట్లు దాటడంపై ఎస్‌బీఐ ఆరా తీసిందన్నారు. 2017, 2018 ఏడాది అంటే చంద్రబాబు హయాం కాదా అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.

పచ్చి అబద్దాలను పనిగట్టుకుని టీడీపీ నేతలు, కొన్ని మీడియా సంస్థలు ప్రచారంచేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్లలో విద్యుత్ డిస్కంలకు సబ్సిడీ రూపంలో చెల్లించాల్సిన 14వేల 500 కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయారన్నారు. దాని వల్లే ఇప్పుడు విద్యుత్ సంస్థలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.

తక్కువ ధరకే థర్మల్ విద్యుత్ దొరుకుతుంటే కావాల్సిన ప్రైవేట్ కంపెనీలతో పీపీఏలు చేసుకుని విద్యుత్ సంస్థలను చంద్రబాబు ముంచేశారన్నారు. ఏకంగా 25ఏళ్ల పాటు ఒప్పందాలు చేసుకుని వ్యవస్థను నాశనం చేశారన్నారు. 2017లో కేవలం 45 రోజుల్లోనే 36 పీపీఏలను చంద్రబాబు చేసుకున్నారని గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన నాటికి 96వేల కోట్లు అప్పు ఉంటే దాన్ని చంద్రబాబు, యనమల కలిసి 2లక్షల 58వేల కోట్లకు తీసుకెళ్లారన్నారు. వీటితో పాటు కార్పొరేషన్లు, విద్యుత్ అప్పులు, సివిల్ సప్లయిస్ అప్పులు కలిపితే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పుల భారం ఏపీపై 3లక్షల 62వేల కోట్లకు చేరిందన్నారు.

నిధులు కేటాయించకుండానే ఎన్నికల నెలలో ఏకంగా 38వేల కోట్ల విలువైన పథకాలను ప్రకటించారన్నారు. ఏప్రిల్‌లో ఒకే రోజు 5వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని.. ఆ సొమ్మునంతా తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు చెల్లించారన్నారు.

First Published:  11 Oct 2019 3:45 PM IST
Next Story