Telugu Global
CRIME

ఉద్యోగుల బోనస్ లు కూడా స్వాహా చేసిన రవిప్రకాశ్

టీవీ9 విక్రయం జరిగిన తర్వాత అంతోఇంతో బోనస్‌ రూపంలో వస్తుందని ఉద్యోగులంతా వేయి కళ్లతో ఎదురు చూశారు. కనీసం ఒక నెలా జీతమైనా బోనస్‌ రూపంలో అదనంగా రాకపోతుందా అని ఆశించారు. కానీ ఎంత వచ్చిందో, ఎంత బొక్కారో ఇప్పటికీ సరిగ్గా తెలియదు. నెంబర్‌ వన్‌ ఛానల్‌ అని, తానో మీడియా లెజెండ్రీ అని చెప్పుకునే రవిప్రకాశ్ సీక్రెట్‌గా కవర్లలో పెట్టి… తన వాళ్లకు మాత్రమే (అందులోనూ కోత పెట్టారు) డబ్బులు ఇచ్చారు. అంటే పూర్తిగా బ్లాక్‌ […]

ఉద్యోగుల బోనస్ లు కూడా స్వాహా చేసిన రవిప్రకాశ్
X

టీవీ9 విక్రయం జరిగిన తర్వాత అంతోఇంతో బోనస్‌ రూపంలో వస్తుందని ఉద్యోగులంతా వేయి కళ్లతో ఎదురు చూశారు. కనీసం ఒక నెలా జీతమైనా బోనస్‌ రూపంలో అదనంగా రాకపోతుందా అని ఆశించారు. కానీ ఎంత వచ్చిందో, ఎంత బొక్కారో ఇప్పటికీ సరిగ్గా తెలియదు.

నెంబర్‌ వన్‌ ఛానల్‌ అని, తానో మీడియా లెజెండ్రీ అని చెప్పుకునే రవిప్రకాశ్ సీక్రెట్‌గా కవర్లలో పెట్టి… తన వాళ్లకు మాత్రమే (అందులోనూ కోత పెట్టారు) డబ్బులు ఇచ్చారు. అంటే పూర్తిగా బ్లాక్‌ మనీ అన్న మాట. మరి నీతి, నిజాయితీ, న్యాయం, చట్టం, సెక్షన్ లు అని మాట్లాడే ఈ మనిషి…. ఛానల్‌ లో మొదటి నుంచీ పని చేస్తున్న వారికి సైతం ఎందుకు డబ్బులు ఇవ్వలేదు?

రవిప్రకాశ్ ని తీసేసిన తర్వాత ఈ విషయం బయట పడటంతో ఉద్యోగుల నుంచి ఇతడికి ఏ మాత్రం సానుభూతి రాలేదు. పైగా కోపం మరింత పెరిగింది. మన కడుపు కొట్టాడు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని టీవీ9 ఉద్యోగులంతా చెప్పుకునే పరిస్థితి.

సగం బోనస్సే..

ఆరున్నర కోట్లను బోనస్‌గా తీసుకున్న రవిప్రకాశ్… టీవీ9 చరిత్రలో ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చింది కేవలం రెండే రెండు సార్లు. అది కూడా ఒకసారి సగం నెల జీతం మాత్రమే. బోనస్‌ ఇచ్చిన ఏడాది జీతాల పెంపు లేదు. అదేమంటే బోనస్‌ ఇచ్చాం కదా అనే సమాధానం వచ్చిందట. 2014 తర్వాత మూడేళ్లు వరుసగా జీతాలు పెంచలేదు.

తన ఖాతాలో రూ.6.50 కోట్లు

బోనస్‌ రూపంలో (ట్యాక్స్‌ కాకుండా) రూ.6.50 కోట్లను రవిప్రకాశ్ తన ఖాతాలో వేసుకున్నాడన్న విషయం తెలిశాక… టీవీ9 ఉద్యోగుల్లో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. మూర్తికి మరో ఐదున్నర కోట్లను కట్టబెట్టాడు. ఇదంతా వైట్‌ మనీ. బ్లాక్‌ ఎంత తిన్నాడో ఎవరికీ తెలియదు.

రవిప్రకాశ్ అరెస్ట్‌తో టీవీ9 ఉద్యోగుల నుంచి ఏ మాత్రం సానుభూతి రాకపోవడానికి కారణం ఇదే. ఉన్నన్ని రోజులూ జీతాలు సరిగ్గా పెంచక, పెంచినా తన వారికే ఎక్కువ ఇచ్చి, చాలా మందిని నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి పీకేసి, కొంతమందికి జీతాలు కోసేసి…. ఇలా ఒకటా రెండా… చాలా దారుణమైన ఉద్యోగ వ్యతిరేక చర్యలు…. రవిప్రకాశ్ పై ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.

నిత్యం మరమ్మతులే..

రవిప్రకాశ్‌ సీఈవో గా ఉన్నన్ని రోజులూ ఆఫీసులో ఏదో ఒక మరమ్మతు పని జరుగుతూనే ఉంటుంది. కుర్చీలు మార్చడం, ఫ్లోరింగ్‌ మార్చడం, కొత్త లిఫ్ట్‌, టైల్స్‌ మార్చడం, చాంబర్లు మార్చడం ఇలా ఎప్పుడూ ఏదో ఒక పని జరుగుతూనే ఉండేది.

ఇదంతా కేవలం ఉపాధి హామీ పనేనన్న విషయం ఇతడు వెళ్లిపోయిన తర్వాత తెలిసిందట. ఖర్చు చేసింది లక్ష అయితే… నాలుగైదు లక్షల బిల్లులు పెట్టుకోవడం… నొక్కేయడం తరచూ జరిగేదన్న విషయం ఉద్యోగులకు సైతం తెలిసిపోయింది.

కేవలం ఆఫీస్‌లో టీ బిల్లులే లక్షల్లో మింగేశారని ప్రచారం జరుగుతోంది. వినాయక చవితికి పెట్టే ప్రసాదాలు, బయట లైవ్‌ కవరేజ్‌ల కోసం పెట్టే ఖర్చులు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే… ఛీ మరింత కక్కుర్తా అనేలా ఉద్యోగులే చీదరించుకుంటున్న పరిస్థితి.

విచారణ తప్పనిసరి

ఈ రకంగా అటు బయటి వారినుంచి దండుకుని, ఇటు సొంత ఉద్యోగులను మోసం చేసి రవిప్రకాష్ చాలా వెనకేసుకున్నారని ప్రచారం వుంది. కేవలం ఒక్కసారికే బోనస్ రూపేణా 6.5 కోట్లు కొట్టేసిన రవిప్రకాష్… ఇంకెన్ని వందల కోట్లు వెనకేసుకున్నాడో అనేది అంతుపట్టని విషయం.

ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి సీజె కు లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. సాన సతీష్ గతంలో టీవీ 9 ఆఫీసుకు వచ్చి తన ఛాంబర్ లో రవిప్రకాష్ ని కలిసేవాడని, గంటల తరబడి మాట్లాడుకునేవారని ప్రచారం వుంది.

First Published:  9 Oct 2019 2:36 PM IST
Next Story