భారీగా పెరిగిన పాకిస్థాన్ అప్పు
పాకిస్థాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. దేశం అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వచ్చిన ఏడాదిలోపే పాకిస్థాన్ 7లక్షల కోట్ల అప్పు తెచ్చింది. గతంలో ఎన్నడూ కూడా ఒకే ఏడాది ఈస్థాయిలో అప్పు తీసుకురాలేదు. ఈ ఏడు లక్షల కోట్ల అప్పులో 2.8 లక్షల కోట్ల విదేశాల నుంచి తీసుకుంది. మిగిలిన అప్పును స్వదేశంలోనే సేకరించింది పాక్ ప్రభుత్వం. ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం అప్పు రూ. […]
పాకిస్థాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. దేశం అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వచ్చిన ఏడాదిలోపే పాకిస్థాన్ 7లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
గతంలో ఎన్నడూ కూడా ఒకే ఏడాది ఈస్థాయిలో అప్పు తీసుకురాలేదు. ఈ ఏడు లక్షల కోట్ల అప్పులో 2.8 లక్షల కోట్ల విదేశాల నుంచి తీసుకుంది. మిగిలిన అప్పును స్వదేశంలోనే సేకరించింది పాక్ ప్రభుత్వం.
ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం అప్పు రూ. 32 లక్షల 24వేల కోట్లకు చేరింది. ఇమ్రాన్ అధికార పగ్గాలు స్వీకరించకముందు పాక్ అప్పు 24 లక్షల 73వేల కోట్లుగా ఉండేది.
అయితే పన్నుల వసూలులో మాత్రం పాకిస్థాన్ అనుకున్న లక్ష్యానికి దగ్గరగా రాగలిగింది. ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసకానికి లక్ష కోట్ల మేర పన్నుల వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా… 96వేల కోట్లను వసూలు చేసింది.