సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భారత్ బోణీ
తొలివన్డేలో అలవోకగా నెగ్గిన భారత్ సౌతాఫ్రికాతో తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ లో మిథాలీరాజ్ నాయకత్వంలోని భారతజట్టు 8 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది. వడోదరాలోని రిలయన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న సౌతాఫ్రికా జట్టు 45.1 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారీ టాపార్డర్లో ఓపెనర్ వూల్వార్ట్ 39, మిడిలార్డర్ ప్లేయర్ కాప్ 54 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి 3 వికెట్లు, […]
- తొలివన్డేలో అలవోకగా నెగ్గిన భారత్
సౌతాఫ్రికాతో తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ లో మిథాలీరాజ్ నాయకత్వంలోని భారతజట్టు 8 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది. వడోదరాలోని రిలయన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న సౌతాఫ్రికా జట్టు 45.1 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సఫారీ టాపార్డర్లో ఓపెనర్ వూల్వార్ట్ 39, మిడిలార్డర్ ప్లేయర్ కాప్ 54 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి 3 వికెట్లు, శిఖా పాండే, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ప్రియా పూనియా ధూమ్ ధామ్ బ్యాటింగ్…
166 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ప్రియా పూనియా- జెమీమా రోడ్రిగేస్ మొదటి వికెట్ కు 83 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. జెమీమా 55, పూనమ్ రౌత్ 16 పరుగులకు అవుట్ కాగా… ప్రియా పూనియా 75, కెప్టెన్ మిథాలీ రాజ్ 11 పరుగుల స్కోర్లతో నాటౌట్ గానిలిచారు.
ఓపెనర్ స్మృతి మంథానా గాయంతో…జట్టులో చోటు సంపాదించిన యువఓపెనర్ ప్రియా పూనియా…తన అరంగేట్రం వన్డేలోనే అదరగొట్టింది. 124 బాల్స్ లో 8 బౌండ్రీలతో 75 పరుగుల నాటౌట్ స్కోరు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొంది.
సిరీస్ లోని రెండో వన్డే వడోదరా వేదికగానే ఈనెల 11న జరుగుతుంది.