Telugu Global
NEWS

విద్యుత్‌ శాఖలో బాబు మనుషులపై ఆరా

చాలా విషయాల్లో జగన్‌ ప్రభుత్వం మంచి మార్కులే సాధిస్తున్నా… కరెంట్‌ విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం ఒత్తిడిని ఇటీవల ఎదుర్కోవాల్సి వచ్చింది. చంద్రబాబునాయుడు తనకు అనుకూలమైన కంపెనీలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను జగన్‌ ప్రభుత్వం సమీక్షించేందుకు సిద్ధమవడంతో వివాదం మొదలైంది. 25 ఏళ్ల పాటు బాబు అనుకూల కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల రద్దు అనగానే మీడియా కూడా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. పీపీఏలను రద్దు చేసుకుంటే విద్యుత్ సంక్షోభం వస్తుంది అన్న భావన కలిగించేందుకు తీవ్రస్థాయిలోప్రయత్నించింది టీడీపీ, […]

విద్యుత్‌ శాఖలో బాబు మనుషులపై ఆరా
X

చాలా విషయాల్లో జగన్‌ ప్రభుత్వం మంచి మార్కులే సాధిస్తున్నా… కరెంట్‌ విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం ఒత్తిడిని ఇటీవల ఎదుర్కోవాల్సి వచ్చింది. చంద్రబాబునాయుడు తనకు అనుకూలమైన కంపెనీలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను జగన్‌ ప్రభుత్వం సమీక్షించేందుకు సిద్ధమవడంతో వివాదం మొదలైంది. 25 ఏళ్ల పాటు బాబు అనుకూల కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల రద్దు అనగానే మీడియా కూడా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.

పీపీఏలను రద్దు చేసుకుంటే విద్యుత్ సంక్షోభం వస్తుంది అన్న భావన కలిగించేందుకు తీవ్రస్థాయిలోప్రయత్నించింది టీడీపీ, దాని అనుకూల మీడియా. ఇందుకు ట్రాన్స్‌కోలో ఉన్నత ఉద్యోగులు కూడా టీడీపీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కీలక స్థానాల్లో పాగా వేసిన వారు …ఇప్పటికీ బాబు మేలు కోరుతూ, ప్రస్తుత ప్రభుత్వానికి చెడు కోరుతున్నారన్న అభిప్రాయం ఉంది.

పీపీఏల సమీక్ష అంశంలోనూ కొందరు ఉన్నతాధికారులు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్‌ శాఖలో ఉత్పత్తితో సంబంధం లేకుండా ఏర్పడుతున్న ఇబ్బందుల వెనుక వీరి హస్తం ఉందని మరో వర్గం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని కీలక స్థానాల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది కొత్త యాజమాన్యం. ఎండీ శ్రీకాంత్ ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. పలువురిని విడతల వారీగా పక్కకు తప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు వీరవిధేయుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్‌ ఇబ్బందులు ఏర్పడిన సమయంలో ఉద్యోగులుగా బాధపడకుండా… చంద్రబాబు అనుకూల ఉద్యోగులు లోలోన ఆనందపడుతున్నట్టు గుర్తించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ పంపిణీలో విఫలమైతే అప్పుడు చంద్రబాబుకు మంచిపేరు వస్తుందన్న ఆలోచనతో కొందరు ఉద్యోగులు పనిచేస్తున్నారని అనుమానిస్తున్నారు.

ఇలాంటి వారంతా ఒక గుంపుగా ఏర్పడి ఆఫీసుల్లో కాకుండా బయట కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇలాంటి ఉద్యోగుల జాబితాను ఇప్పటికే ట్రాన్స్‌కోలోని ఇతర వర్గాల ఉద్యోగులు సిద్ధం చేసి ఉన్నతాధికారుల చేతిలోపెట్టారు.

First Published:  9 Oct 2019 3:57 AM IST
Next Story