Telugu Global
NEWS

ప్రపంచ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ లో మేరీకోమ్

రెండోరౌండ్లో మేరీకోమ్ అలవోక విజయం ప్రపంచ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ కు ఆరుసార్లు చాంపియన్ మేరీకోమ్ చేరుకొంది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ బాక్సింగ్ టోర్నీ…51 కిలోల విభాగంలో 7వ సీడ్ గా బరిలోకి దిగిన మేరీకోమ్ కు తొలిరౌండ్లో బై లభించింది. నేరుగా రెండోరౌండ్లో పాల్గొన్న వెటరన్ మేరీకోమ్.. ప్రత్యర్థి థాయ్ బాక్సర్ జుటామాస్ జిట్ పాంగ్ ను 5-0తో చిత్తు చేసి… క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది. తన కెరియర్ […]

ప్రపంచ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ లో మేరీకోమ్
X
  • రెండోరౌండ్లో మేరీకోమ్ అలవోక విజయం

ప్రపంచ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ కు ఆరుసార్లు చాంపియన్ మేరీకోమ్ చేరుకొంది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ బాక్సింగ్ టోర్నీ…51 కిలోల విభాగంలో 7వ సీడ్ గా బరిలోకి దిగిన మేరీకోమ్ కు తొలిరౌండ్లో బై లభించింది.

నేరుగా రెండోరౌండ్లో పాల్గొన్న వెటరన్ మేరీకోమ్.. ప్రత్యర్థి థాయ్ బాక్సర్ జుటామాస్ జిట్ పాంగ్ ను 5-0తో చిత్తు చేసి… క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

తన కెరియర్ లో తొమ్మిదోసారి ప్రపంచ బాక్సింగ్ టోర్నీలలో పాల్గొంటూ వచ్చిన మేరీకోమ్ కు 48 కిలోల విభాగంలో ఆరు బంగారు పతకాలు, ఓ కాంస్య పతకం సాధించిన రికార్డు ఉంది.

అయితే…51 కిలోల విభాగంలో పాల్గొన్నసమయంలో మాత్రం మేరీకోమ్ సఫలం కాలేకపోయింది. ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం 51 కిలోల బరిలోకి దిగిన మేరీకోమ్.. తనకంటే మెరుగైన ఆరుగురు మెరుగైన బాక్సర్లతో మేరీకోమ్ తలపడాల్సి ఉంది.

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ 51 కిలోల విభాగం బరిలోకి దిగనున్న మేరీకోమ్…ప్రపంచకప్ లో సైతం అదే విభాగంలో పోటీకి దిగడం నేలవిడిచి సాము చేయడం లాంటిదే.

ఆసియా బాక్సింగ్, ఆసియా క్రీడల బాక్సింగ్, కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు సాధించిన మేరీకోమ్ …ఇప్పుడు ప్రపంచబాక్సింగ్ స్వర్ణానికి సైతం గురిపెట్టింది.

First Published:  8 Oct 2019 5:54 PM IST
Next Story