Telugu Global
Others

చెత్త ఏరుకోవడం హక్కా?

స్వచ్ఛ భారత్ పేరిట జరుగుతున్న మహోధృత ప్రచారం రెండు ముఖ్యమైన పరిణామాల నుంచి అసలు విషయం నుంచి మన దృష్టిని మరల్చకూడదు. సామాజికంగా ఉదార స్వభావం గల వారిగా చెలామణి అయ్యే కొందరు రాజకీయ నాయకులు చెత్త ఏరుకుని జీవనం సాగించే వారితో మమేకం అయినట్టుగా ప్రవర్తించడంవల్ల చెత్త ఏరుకునే వారి గురించిన ప్రస్తావన తరచుగా వస్తోంది. మరో వేపున చెత్త ఏరుకుని బతికే వారు అది తమ హక్కు అని భావిస్తున్నారు. నిజానికి చెత్త ఏరుకుని […]

చెత్త ఏరుకోవడం హక్కా?
X

స్వచ్ఛ భారత్ పేరిట జరుగుతున్న మహోధృత ప్రచారం రెండు ముఖ్యమైన పరిణామాల నుంచి అసలు విషయం నుంచి మన దృష్టిని మరల్చకూడదు. సామాజికంగా ఉదార స్వభావం గల వారిగా చెలామణి అయ్యే కొందరు రాజకీయ నాయకులు చెత్త ఏరుకుని జీవనం సాగించే వారితో మమేకం అయినట్టుగా ప్రవర్తించడంవల్ల చెత్త ఏరుకునే వారి గురించిన ప్రస్తావన తరచుగా వస్తోంది.

మరో వేపున చెత్త ఏరుకుని బతికే వారు అది తమ హక్కు అని భావిస్తున్నారు. నిజానికి చెత్త ఏరుకుని బతకడం వారు కావాలనో, ఇష్టంతోనో ఎంచుకున్న పని కాదు. చెత్త ఏరుకుని బతికే వారి మీద అపారమైన అభిమానం ఒలకబోసే వారు సూచన ప్రాయంగా వారు ఆ పని చేసి వారితో మమేకమైనట్టు భ్రమ కల్గించవచ్చు. కానీ అది వారి రోజువారీ వ్యవహారం కాదు. రెండవది చెత్త ఏరుకుని బతికే వారు దాన్ని ఇష్టంతో వృత్తిగా ఎన్నుకున్న వారు కాదు. విధిలేకే వారు ఆ పని చేస్తారు.

బలవంతాన వారు ఆ పని చేయక తప్పనప్పుడు అది వారి హక్కు ఎలా అవుతుంది? చెత్త ఏరుకోవడం సానుకూలమైన హక్కా లేక ప్రతికూలమైన హక్కా అన్న ప్రశ్న తలెత్తక మానదు.

వ్యక్తుల హక్కులు సానుకూలమైనవి. వాటికి సామాజిక విలువ ఉంటుంది. ఈ హక్కులకు రాజ్యాంగ బద్ధత ఉంటుంది. వ్యవస్థాగతంగా రక్షణ ఉంటుంది. ఒక హక్కు సానుకూలమైందనప్పుడు అలాంటి పనిని ఇష్టపూర్వకంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

హక్కు అయితే ఆ పని మానవ శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పని పరిశుభ్రమైంది అయితే, మంచి పని పరిస్థితులు ఉంటే ఆ పని చేసే వారికి మనుషులుగా విలువా ఉంటుంది. అది ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇలాంటి పనులు అందుబాటులో ఉన్నప్పుడు ఆ పని చేయడానికి పోటీ కూడా ఉంటుంది. వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ విలువా ఉంటుంది. మంచి ఉపాధికి పోటీ ఉన్నప్పుడు సామాజిక అంతరువులలో స్థానమూ ఉంటుంది. అవి సాధారణ ఉపాధిలో భాగమూ అవుతాయి. సామాజిక విలువ ఉంటే గౌరవరమూ ఉంటుంది.

ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థల్లో, ప్రభుత్వంలో చేసే ఉద్యోగాలకు ఉన్నతమైన సామాజిక స్థాయీ ఉంటుంది. అప్పుడు అది హక్కుగా మారుతుంది. చెత్త ఏరుకుని బతికే వారు ఈ దృష్టితోనే తాము చేసే పని తమ హక్కు అని భావిస్తున్నారా? ఈ ప్రశ్నకు అవునని సమాధానం చెప్పడం కష్టమే. అలా చెప్పలేకపోవడానికి మూడు కారణాలున్నాయి.

మొదటిది… చెత్త ఏరుకునే వారే కాక సమాజం కూడా అది గౌరవ ప్రదమైన పనిగా భావించే అవకాశం లేదు. సభ్య సమాజం చెత్త ఏరుకోవడాన్ని గౌరవప్రదమైన పనిగా భావించకపోవడమే కాక ఆ పని చేసే వారిని అనుమాన దృష్టితో కూడా చూస్తుంది. ఇది నైతికంగా కూడా నిర్బంధమైందే.

చెత్తఏరుకునే వారు సైతం తమను తాము అంత మానవీయమైన వారిగా భావించరు. చెత్త కుండీల్లో కెలికి తాము చేసే పనిని వారు ఇష్టంగా ఏమీ చేయరు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ పని చేస్తుంటారు. ఇది గౌరవప్రదమైన వ్యవహారం ఏమీ కాదు.

రెండవది… చెత్త ఏరుకుని బతికే వారు తాము అమానవీయమైన బతుకు గడుపుతున్నామనే భావిస్తారు. చెత్త ఏరుకుని బతికే వారు వెలేసినట్టు విడి వాడల్లోనే జీవిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారు మురికివాడల్లోనే నివసిస్తారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసేటప్పుడు కూడా వీరు తమను తాము వెలికి గురైన వారిలాగే భావిస్తారు. చెత్త ఏరుకుని బతికే వారిని కళంకితులుగానే భావిస్తారు. ఇది వారిని మరింత కుంగదీస్తుంది.

మూడవది… చెత్తఏరుకోవడం తమ హక్కు అని భావించే వారికి మెరుగైన పని చేయొచ్చుననే ఆలోచన కూడా రాకుండా చేయవచ్చు. మెరుగైన పని చేయడానికి అవకాశం లేనందువల్ల చెత్త ఏరుకుని బతికే వారు అదే పని కొనసాగిస్తుంటారు. పైగా ఈ రోజుల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా తక్కువే.

తమకు చెత్త ఏరుకునే అవకాశం కూడా లేకుండా ఘరానా వ్యక్తులు చేస్తారేమోనన్న భయంతోనే ఈ పని చేసే వారు అది తమ హక్కు అంటారు.

ఏమైనప్పటికీ ఈ పనిని హక్కుగా భావించే వారిని మరింత పరిశుభ్రమైన, పోటీ ఉండే, ఆకర్షణీయమైన పని చేసే అవకాశం ఉండేట్టు ప్రోత్సహించాలి.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  7 Oct 2019 5:38 PM IST
Next Story