Telugu Global
National

వక్ఫ్‌ భూమి కబ్జా చేసిన "ఈనాడు"- స్పందనలో ఫిర్యాదు

ఈనాడు పత్రిక యాజమాన్యంపై ముస్లిం పెద్దలు ఫిర్యాదు చేశారు. కర్నూలు రూరల్ మండలం మునగాలపాడు వద్ద ఈనాడు యాజమాన్యం వక్ఫ్ భూమి 4. 68 ఎకరాలను కబ్జా చేసిందంటూ స్పందన కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఫిర్యాదు ఇచ్చారు. భూమి కబ్జా చేయడంపై ప్రశ్నించినందుకు గాను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గత రెండున్నరేళ్లుగా తమపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి వేధించారని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. భూకబ్జా అంశాన్ని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన […]

వక్ఫ్‌ భూమి కబ్జా చేసిన ఈనాడు- స్పందనలో ఫిర్యాదు
X

ఈనాడు పత్రిక యాజమాన్యంపై ముస్లిం పెద్దలు ఫిర్యాదు చేశారు. కర్నూలు రూరల్ మండలం మునగాలపాడు వద్ద ఈనాడు యాజమాన్యం వక్ఫ్ భూమి 4. 68 ఎకరాలను కబ్జా చేసిందంటూ స్పందన కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఫిర్యాదు ఇచ్చారు.

భూమి కబ్జా చేయడంపై ప్రశ్నించినందుకు గాను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గత రెండున్నరేళ్లుగా తమపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి వేధించారని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

భూకబ్జా అంశాన్ని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన స్థలాన్ని పరిశీలించారని ముస్లిం పెద్దలు వివరించారు. మునగాలపాడు సమీపంలోనే జాతీయ రహదారి-44 పక్కనే 4.68 ఎకరాల వక్ఫ్‌ భూమి ఉందని… టీడీపీ పెద్దల అండతో 2015లో ఈనాడు యాజమాన్యం ఆ భూమిని కబ్జా చేసిందన్నారు.

రికార్డుల్లోనూ ఆ భూమి వక్ఫ్‌ బోర్డు పేరు మీదే ఉందని… అయినా సరే కండబలంతో ఈనాడు యాజమాన్యం భూమిని ఆక్రమించిందని వివరించారు.

First Published:  7 Oct 2019 2:18 AM IST
Next Story