కాకాణిపై కోటంరెడ్డి సంచలన ఆరోపణలు
ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారన్న కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… తానూ ఏ తప్పూ చేయలేదని చెప్పారు. విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఎంపీడీవో సరళ కేవలం పాత్రధారి మాత్రమేనని… అసలు సూత్రధారులు వేరే ఉన్నారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఎంపీడీవో సరళ వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. లేఅవుట్‌కు నీటి […]
ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారన్న కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… తానూ ఏ తప్పూ చేయలేదని చెప్పారు. విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఎంపీడీవో సరళ కేవలం పాత్రధారి మాత్రమేనని… అసలు సూత్రధారులు వేరే ఉన్నారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఎంపీడీవో సరళ వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
లేఅవుట్‌కు నీటి సరఫరా కోసం మూడు నెలలుగా ఎంపీడీవో చుట్టూ తిరుగుతున్నామని కోటంరెడ్డి చెప్పారు. కనెక్షన్ ఇవ్వాలని పదేపదే తానుకోరానన్నారు. ఎంపీడీవోకు తాను ఫోన్ చేసింది నిజమేనని… నీటి సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరగా… ఎమ్మెల్యే గారే (లేఅవుట్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉంది) వద్దన్నారు అని ఆమె చెప్పారన్నారు.
ఆ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డే అని కోటంరెడ్డి మీడియా ముందు నేరుగా చెప్పారు. ఎంపీడీవోతో మాట్లాడిన తర్వాత నేరుగా కాకాణికి ఫోన్ చేశానని… ఆయన కూడా నీటి కనెక్షన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదని… వేరే సమస్యలు ఉన్నాయంటూ దాటేశారన్నారు.
ఇంతలోనే తాను సరళ ఇంటిపై దాడి చేశానని కేసులు పెట్టించడం ఎంత వరకు సమంజసమని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఎంపీడీవో సరళ కేవలం పాత్రధారి మాత్రమేనని… అసలు సూత్రధారులు వేరే ఉన్నారని ఆరోపించారు.
ఆధారాలుంటే అరెస్ట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తునందుకు గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అన్నాక అలాగే ఉండాలన్నారు.
కాకపోతే తానే తప్పు చేయలేదని… మూడు నెలలుగా వాటర్ కనెక్షన్‌కు అనుమతి ఇవ్వకపోవడంతోనే తాను ఆమెకు ఫోన్ చేశానని… విచారణలో అన్నీ బయటకు వస్తాయని కోటంరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఈ వివాదం కాకాణి గోవర్ధన్ రెడ్డి… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.