Telugu Global
NEWS

హుజూర్ నగర్ ఉప ఎన్నిక.... కారు పార్టీ అసలు టెన్షన్ ఇదట !

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు ఒకటే టెన్షన్ పట్టుకుంది. మొన్నటి ఎన్నికల్లో కొన్ని గుర్తులు టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉండడం వల్ల కొందరు టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలోనూ అవే గుర్తులు మళ్లీ టీఆర్ఎస్ ను ఓడిస్తాయా అన్న టెన్షన్ గులాబీ నేతలకు పట్టుకుంది. గులాబీ పార్టీకి గతంలో షాకిచ్చిన సింబల్ లు.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో […]

హుజూర్ నగర్ ఉప ఎన్నిక....  కారు పార్టీ  అసలు టెన్షన్ ఇదట !
X

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు ఒకటే టెన్షన్ పట్టుకుంది. మొన్నటి ఎన్నికల్లో కొన్ని గుర్తులు టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉండడం వల్ల కొందరు టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు ఓటమి చెందారు.

ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలోనూ అవే గుర్తులు మళ్లీ టీఆర్ఎస్ ను ఓడిస్తాయా అన్న టెన్షన్ గులాబీ నేతలకు పట్టుకుంది. గులాబీ పార్టీకి గతంలో షాకిచ్చిన సింబల్ లు.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా ఉన్నాయా అని ఆరాతీస్తున్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ కంచుకోట పై గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన అధికార పార్టీకి… సింబల్స్ టెన్షన్ పట్టుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా వెళ్లడంతో వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.

మండలానికి ఒక్కో మంత్రిని ఇప్పటికే ఇన్ చార్జిగా నియమించింది. అయితే ఆ నేతలంతా ఇపుడు సింబల్స్ దెబ్బకు వామ్మో అంటున్నారట.

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ , ఏప్రిల్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ ను భారీగా దెబ్బతీసింది. పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించింది. రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు కారును పోలి ఉండి ఓట్లు చీల్చాయి. ఈసారి కూడా టిఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉండే గుర్తులు ఉండడంతో అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది.

ముఖ్యంగా ఆటో, ట్రక్, రోడ్ రోలర్ గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. పోయిన ఎన్నికల్లో వృద్ధులు, నిరక్షరాస్యులకు అర్థం కాకపోవడంతో వాళ్ళు కారు గుర్తుకు ఓటు వేయబోయి వేరే గుర్తులకు వేశారు. దాంతో ఫలితాలు తారుమారైన సంఘటనలు చూశారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా గులాబీ పార్టీకి అదే భయం పట్టుకుంది. ఈ ఉపఎన్నికలో కూడా కారును పోలిన ట్రాక్టర్, రోడ్ రోలర్ గుర్తులు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని కేసీఆర్ తాజాగా నేతలకు దిశా నిర్దేశం చేశారని తెలిసింది.

First Published:  6 Oct 2019 9:48 AM GMT
Next Story