Telugu Global
National

టెలికాం కంపెనీల 'కాల్ రింగ్' వార్.. జియోవి చీప్ ట్రిక్స్ అంటూ మండిపాటు..!

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడఫోన్-ఐడియాల మధ్య జరుగుతున్న ప్రశ్చన్న యుద్దం ముదిరి పాకానపడింది. టెలికాం సెక్టార్‌లోకి జియో ప్రవేశంతోనే కుదేలైన మిగిలిన కంపెనీలు.. ఇప్పుడు ఆ సంస్థ వేస్తోన్న కొత్త ఎత్తుగడలతో భారీగా రెవెన్యూ కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా మిగతా కంపెనీలు కూడా వ్యవహరిస్తున్నాయి. మొన్నటి దాకా టారిఫ్ ప్లాన్స్‌తో దెబ్బ కొట్టిన జియో.. ఇప్పుడు ‘కాల్ రింగ్’తో పెద్ద ప్లాన్ వేసింది. తమ […]

టెలికాం కంపెనీల కాల్ రింగ్ వార్.. జియోవి చీప్ ట్రిక్స్ అంటూ మండిపాటు..!
X

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడఫోన్-ఐడియాల మధ్య జరుగుతున్న ప్రశ్చన్న యుద్దం ముదిరి పాకానపడింది. టెలికాం సెక్టార్‌లోకి జియో ప్రవేశంతోనే కుదేలైన మిగిలిన కంపెనీలు.. ఇప్పుడు ఆ సంస్థ వేస్తోన్న కొత్త ఎత్తుగడలతో భారీగా రెవెన్యూ కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా మిగతా కంపెనీలు కూడా వ్యవహరిస్తున్నాయి.

మొన్నటి దాకా టారిఫ్ ప్లాన్స్‌తో దెబ్బ కొట్టిన జియో.. ఇప్పుడు ‘కాల్ రింగ్’తో పెద్ద ప్లాన్ వేసింది. తమ కంపెనీ నెట్‌వర్క్‌ నుంచి చేసే కాల్స్‌కు కేవలం 25 సెకన్లు మాత్రమే రింగ్ అందిస్తోంది. దీనిపైనే ఇతర కంపెనీలు మండిపడుతున్నాయి. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లను భారీగా పొందడానికే జియో ఇలా చేస్తోందని ఎయిర్‌టెల్ వాదిస్తోంది. ఐయూసీ నిబంధనల ప్రకారం కాల్ ఎవరి నెట్‌వర్క్‌లో ఎండ్ అయితే ఆ కంపెనీకి చార్జీలు చెల్లించాలి. అంటే ఎయిర్‌టెల్ నుంచి జియోకి కాల్ చేస్తే ఆ కాల్ ద్వారా జియోకు ఆదాయం వస్తుంది.

కాగా, జియో 25 సెకెన్లు మాత్రమే రింగ్ అందించడంతో కస్టమర్ కాల్ కట్ అవుతుంది. దాంతో అవతల వ్యక్తి ఆటోమెటిక్‌గా జియోకు కాల్ చేస్తాడు. దీంతో జియోకు ఐయూసీ ద్వారా ఆదాయం వస్తుంది. ఇదే విషయాన్ని ఎయిర్‌టెల్ వాదిస్తోంది. రింగ్ సమయాన్ని తగ్గించి అవతల వ్యక్తి బలవంతంగా జియోకు కాల్ చేసేలా చేసుకోవడానికే ఇలాంటి ఎత్తుగడ వేసిందని అంటోంది.

అంతే కాక జియో ఎత్తుగడలను బ్రేక్ చేసేందుకు ఎయిర్‌టెల్ కూడా తమ రింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించింది. కాగా, వోడఫోన్-ఐడియా 30 సెకన్లను కొనసాగిస్తుండగా.. బీఎస్ఎన్ఎల్ 40 సెకన్లను అలాగే ఉంచింది.

జియో కాల్ రింగ్ టైం విషయాన్ని ట్రాయ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. దీనిపై జియో స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 15 నుంచి 20 సెకెన్లు మాత్రమే కాల్ రింగ్ టైం ఉందని.. కస్టమర్ కాల్ ఎత్తడానికి 20 సెకెన్లు సరిపోతుందని వాదిస్తోంది. తాము ఉచిత కాల్స్ అందిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌కు మిస్డ్ కాల్స్ తాకిడి ఎక్కువగా ఉంటోందని.. అందుకే సమయాన్ని తగ్గించామని అంటోంది.

మరోవైపు జియో కాల్ రింగ్ టైం తగ్గించక ముందు ఇరు కంపెనీల మధ్య ట్రాఫిక్ 65-35గా ఉందని.. కాని ఇప్పుడు అది 60-40కి చేరుకుందని ఎయిర్‌టెల్ అంటోంది. ఇది ఇలాగే కొనసాగితే కంపెనీ మరింత ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని చెబుతోంది.

మరి ఈ కాల్ రింగ్ టైం వార్ ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

First Published:  4 Oct 2019 5:03 PM GMT
Next Story