Telugu Global
Cinema & Entertainment

ఇదేనా తారక్ న్యూ లుక్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘RRR’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరూ హీరోలు తమ శరీరాకృతిని.. లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ […]

ఇదేనా తారక్ న్యూ లుక్?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘RRR’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరూ హీరోలు తమ శరీరాకృతిని.. లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ‘అరవింద సమేత’ లో స్లిమ్ గా కనిపించిన ఎన్టీఆర్ ‘RRR’ కోసం కొంచెం బరువు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ పూర్తిగా స్లిమ్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో ఇది కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన వేరియేషన్ అనే టాక్ వినిపిస్తోంది. కానీ కొందరు మాత్రం ఇది పాత ఫోటోనే అని కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అయిందని అంటున్నారు. ఏ విషయం నిజమో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వేచి చూడకతప్పదు.

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘RRR’ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్.. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో.. ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది.

First Published:  5 Oct 2019 4:59 AM IST
Next Story