17న వైసీపీ ఎంపీ వివాహం
చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టిన వైసీపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈనెల 17న ఆమె వివాహం జరగనుంది. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ని ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈనెల 17న రాత్రి 3. 15 గంటలకు వివాహ ముహూర్తం. గొడ్డేటి మాధవి వివాహం చేసుకోబోతున్న శివప్రసాద్… ఎస్‌టీ థెరిసా విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా, శివ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరి వివాహం కొయ్యూరు మండలం […]
చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టిన వైసీపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈనెల 17న ఆమె వివాహం జరగనుంది. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ని ఆమె వివాహం చేసుకోబోతున్నారు.
ఈనెల 17న రాత్రి 3. 15 గంటలకు వివాహ ముహూర్తం. గొడ్డేటి మాధవి వివాహం చేసుకోబోతున్న శివప్రసాద్… ఎస్‌టీ థెరిసా విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా, శివ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరి వివాహం కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో జరుగుతుంది. రిసెప్షన్‌ను విశాఖలో నిర్వహించనున్నట్టు ఆమె సోదరుడు తెలిపారు.
విశాఖ జిల్లా అరకు నుంచి వైసీపీ తరపున ఇటీవల ఎన్నికల్లో గెలిచిన గొడ్డేటి మాధవి లోక్‌సభ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలు. కేవలం 25 ఏళ్ల మూడు నెలలకే ఎంపీగా ఆమె ఎన్నికయ్యారు. బీఎస్సీ బీఈడీ చేసిన మాధవి పీఈటీ టీచర్‌గా పనిచేసే వారు. జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు.జగన్ ప్రోత్సాహంతో వైసీపీ తరపున బరిలో దిగి టీడీపీ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్‌ను 2 లక్షల 21 వేల భారీ ఓట్ల తేడాతో ఓడించి ఎంపీగా గెలిచారామె.