Telugu Global
NEWS

కోటంరెడ్డి మరో చింతమనేని అవ్వాలనుకుంటున్నారా?

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో తన పార్టీ నేతలు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎక్కడా దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడకుండా కట్టడి చేయడంలో విజయవంతమైన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డికి… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తీరు మాత్రం ఇబ్బందిగానే ఉంది. తాజాగా ఆయనపై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి కోటంరెడ్డి, ఆయన అనుచరులు తమ ఇంటిపై దాడి చేశారని నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటంరెడ్డి అనుచరుడు ఒకరు […]

కోటంరెడ్డి మరో చింతమనేని అవ్వాలనుకుంటున్నారా?
X

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో తన పార్టీ నేతలు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎక్కడా దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడకుండా కట్టడి చేయడంలో విజయవంతమైన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డికి… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తీరు మాత్రం ఇబ్బందిగానే ఉంది.

తాజాగా ఆయనపై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి కోటంరెడ్డి, ఆయన అనుచరులు తమ ఇంటిపై దాడి చేశారని నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటంరెడ్డి అనుచరుడు ఒకరు లేఅవుట్ వేశారని.. ఆ లేఅవుట్‌కు తాగునీటి పైప్‌లైన్‌తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల కోరారని చెప్పారు.

బిజీగా ఉండడం వల్ల ఆ పని చేయలేకపోయానని… ఇంతలో శుక్రవారం సాయంత్రం కోటంరెడ్డి తన నివాసానికి వచ్చారని.. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని… తన తల్లి ఉన్నారని… అలా తన ఇంటికి వచ్చిన కోటంరెడ్డి విద్యుత్‌ వైర్లు కట్ చేయించడం, తాగునీటి పైపులైన్‌ను ధ్వంసం చేయడం చేయించారని ఎంపీడీవో ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తాను వెంటనే సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన జోక్యం చేసుకుని విద్యుత్ సరఫరా పునరుద్దించేలా చర్యలు తీసుకున్నారని.. పైపులైన్ బాగు చేయించారని ఎంపీడీవో సరళ వివరించారు.

సరళ పనిచేస్తున్న వెంకటాచలం మండలం సర్వే పల్లి నియోజకవర్గంలో ఉండగా… ఆమె నివాసం ఉంటున్న కల్లూరుపల్లి నెల్లూరురూరల్ పరిధిలో ఉంది. కోటంరెడ్డి పదేపదే వివాదాల్లో చిక్కుకుని పార్టీకి చెడ్డపేరు తెస్తుండడంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలోనూ చింతమనేని ప్రభాకర్‌లు తయారు కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందంటున్నారు.

First Published:  4 Oct 2019 8:53 PM GMT
Next Story