చందన దీప్తి కాబోయే భర్త బలరామిరెడ్డి బ్యాగ్రౌండ్ ఇది...
మెదక్ ఎస్పీ చందన దీప్తికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే రచనలకు చాలా క్రేజ్ ఉంది. చందన దీప్తి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. తన స్నేహితుడినే ఆమె పెళ్లి చేసుకుంటున్నారు. చందన దీప్తి సొంతూరు వరంగల్. పలు ప్రాంతాలో విద్యాభ్యాస్యం సాగింది. చందన దీప్తి … తన స్నేహితుడు బలరామిరెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. బలరామిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కజిన్ అవుతారు. బలరామ్ రెడ్డి పుట్టింది […]
మెదక్ ఎస్పీ చందన దీప్తికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే రచనలకు చాలా క్రేజ్ ఉంది. చందన దీప్తి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. తన స్నేహితుడినే ఆమె పెళ్లి చేసుకుంటున్నారు.
చందన దీప్తి సొంతూరు వరంగల్. పలు ప్రాంతాలో విద్యాభ్యాస్యం సాగింది. చందన దీప్తి … తన స్నేహితుడు బలరామిరెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. బలరామిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కజిన్ అవుతారు. బలరామ్ రెడ్డి పుట్టింది నెల్లూరులో. చదువు మొత్తం విదేశాల్లో కొనసాగింది. న్యూజిలాండ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో స్థిరపడ్డారు.
చందన దీప్తి, బలరామిరెడ్డి ఇద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. దాంతో పెద్దల అంగీకారంతోనే వీరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులను వీరు తమ వివాహానానికి ఆహ్వానించారు. ఈనెలలో వీరి వివాహం హైదరాబాద్‌లో జరుగుతుంది.